ప్రస్తుతం తెలంగాణలో సంచలనం రేపుతున్న విషయం ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఆర్టీసీ సమ్మోపై నేడు చర్చలు విఫలం కావడంతో ఈరోజు అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు కరెక్ట్ గా పండుగా సీజన్ కావడంతో పండుగకు ఊరు వెళ్లాలంటే ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ వారేమో సమ్మో అంటూ బస్సు నిలిపేశారు. 


ప్రైవేట్ బస్సు వారేమో సంబరాలు చేసుకుంటూ .. ఇదే టైం అని టికెట్ ధర ఆకాశాన్ని తాకిచ్చారు. దీంతో ఎటు వెళ్లాలో తెలియని ప్రయాణికులకు ఊరట కలిగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వింత నిర్ణయం తీసుకుంది. మాకు డ్రైవర్లు, కండక్టర్లు కావాలి అంటూ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల సమ్మో చేసి వారికీ కావలసింది వారు దక్కించుకోవాలనుకుంటే వీరు ఏమో వారికీ ఇవ్వకుండా.. మీరు లేకపోతే ఏంటి మాకు కావాల్సిన వారిని మేము తెచ్చుకోలేమా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రవర్తిస్తుంది. 


కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మోపై ఐఏఎస్ సునీల్ శర్మ మాట్లాడుతూ సమ్మె చేస్తే ప్రత్యామ్నాయాలతో రెడీగా ఉన్నాం, 2100 అద్దె బస్సులు అందుబాటులో ఉంచుతాం. 20 వేలకు పైగా స్కూల్ బస్సులు ఉన్నాయి అవసరమైతే వాటినీ నడుపుతాం. పోలీస్ ప్రొటెక్షన్ తో బస్సులు నడిపించడానికి రెడీగా ఉన్నాం. 3వేల మంది డ్రైవర్స్ ను  నియమిస్తాం. అంటూ ఆయన చెప్పారు. మరి ఈ సమ్మోతో ఆర్టీసీ కార్మికులు తగ్గి వారి పని వారు చేసుకుంటారా ? లేక ప్రభుత్వమే దిగొస్తుందా ? అనేది చూడాలి. ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి డ్రైవర్లు, కండక్టర్లు కావాలి. 


మీకు డ్రైవింగ్ వస్తే.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా తాత్కాలికంగా పనిచేయడానికి కనీసం 18 నెలల అనుభవం ఉంటె, హెవీ  ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ తో పాటు పదవ తరగతి పాస్ అయి ఉంటే చాలు. మీరు తాత్కాలిక ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా పని చెయ్యచ్చు అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: