హుజూర్ నగర్ ఉపఎన్నికకు సంబంధించి అభ్యర్థుల ఖర్చుల యొక్క వివరాలను పరిశీలించటం కొరకు ప్రత్యేకంగా పరిశీలకుడిని ఎలక్షన్ కమిషన్ నియమించింది. రిటైర్డ్ అధికారి బాలకృష్ణన్ ను ఈసీ పరిశీలకుడిగా నియమించింది. ఈసీ సూర్యాపేట ఎస్పీని కూడా బదిలీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఎస్పీ స్థానంలో ఆర్ భాస్కరన్ ను కొత్త ఎస్పీగా ఈసీ నియమించింది. తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఎన్నికల కమిషన్ కు బీజేపీ పార్టీకి చెందిన కొందరు నేతలు ఫిర్యాదు చేశారు. 
 
ఎన్నికల కమిషన్ కు హుజూర్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న విషయాల గురించి బీజేపీ నేతలు వివరించి చెప్పారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేతలు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఈసీకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు ప్రస్తుతం హుజూర్ నగర్ ఎన్నికలపైనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పోలీసులు, యంత్రాంగాన్ని ప్రలోభపెడుతోందని, ప్రత్యర్థులకు ఆటంకాలు కలిగిస్తోందని ఈసీకి ఫిర్యాదులు అందాయి. 
 
బీజేపీ నేతలు ఈసీకు ఎన్నికల పరిశీలకుడిని నియమించాలని కోరడంతో ఈసీ వెంటనే నియమించినట్లు తెలుస్తోంది. ఎస్పీ బాస్కరన్ గతంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పని చేశారని తెలుస్తోంది. గతంలో ఎన్నికల విధుల్లో కూడా భాస్కరన్ పని చేశారని తెలుస్తోంది. భాస్కరన్ ఇంతకాలం భూపాలపల్లి ఎస్పీగా పని చేశారు. భాస్కరన్ ఈరోజు లేదా రేపు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
హుజూర్ నగర్ ఎన్నికను అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలలో తుది పోరులో 28 మంది అభ్యర్థులు నిలిచారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు 13 మంది ఉండగా 15 మంది స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. సీపీఐ టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వగా టీజేఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: