ఇన్-కం టాక్స్ డిపార్ట్మెంట్ నుండి వచ్చే నోటీసులే కాదు  ఉత్తర  ప్రత్యుత్తరాలన్నీ కంప్యూటర్ జనరేట్ అయిన  డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (డీఐఎన్) తో రానున్నాయి. డీఐఎన్ లేని నోటీసులు చెల్లుబాటు కావు అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నెల అంటే అక్టోబర్ 1 నుంచే ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని ఆమె తెలిపారు. తాజాగా అమలు చేస్తున్న విధానం ద్వారా పన్ను చెల్లింపు దారులకు ఐటీ అధికారుల నుంచి ఎదురయ్యే వేదింపులకు అడ్డుకట్ట వేయవచ్చునని  డీఐఎన్ ద్వారా అన్ని అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలపై అధికారులు జవాబు చెప్పాల్సి ఉంటుందని ఆర్ధిక శాఖ ప్రతినిది వెల్లడించారు. 


అంచనాలు, అప్పీళ్లు, ఆదేశాలు, మినహాయింపులు, విచారణ, దర్యాప్తు, సమాచార పరిశీలన, జరిమానా, అభియోగాలు, సవరణలు, ఆమోదం తదితర అంశాలు సహా అక్టోబర్ 1 తర్వాత వెలువడే అన్ని పత్రాలపై ఆడిట్ ట్రయల్స్ ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Image result for nirmala sitharaman 

‘‘డీఐఎన్ విధానం ద్వారా టాక్స్ ఎడ్మినిస్ట్రేషన్ లో  పారదర్శకత, పూర్తి జవాబుదారీతనం లభిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప డీఐఎన్ లేకుండా చేతిరాతతో సంప్రదింపులు సాగించే అవకాశమే లేదు’’ అని అధికారి పేర్కొన్నారు.  ఒకవేళ ఏదైనా చేతితో ఏదైనా పత్రాలు రాయాల్సి వస్తే వాటిని 15 రోజుల్లోగా సిస్టం పోర్టల్‌ లో చేర్చాల్సి  ఉంటుంది. 

 

పన్ను చెల్లింపు దారులపై ఎలాంటి వేధింపులు లేకుండా మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన ప్రమాణాలను ప్రవేశ పెట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే తాజా విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్టు ఐటీ అధికారి వెల్లడించారు. అవినీతి నివారించటానికి ఇదొక మంచి మార్గంగా భావిస్తున్నారు ప్రతి కమ్యూనికేషన్ రికార్డుల్లో నిక్షిప్తమై ఉంటుంది. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: