కేంద్రప్రభుత్వం కొన్ని విషయాల్లో చాలా క్లియర్ గా ఉంటూ వస్తున్నది.  ముఖ్యంగా జాతీయ భద్రతా, సుస్థిర పాలన వంటి విషయాల్లో మోడీ చాలా స్పష్టంగా ఉంటున్నారు.  జాతీయ భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి అంశాన్నైనా సరే కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందని ఇప్పటికే స్పష్టంగా చెప్పారు.  దేశంలో ముష్కరులు దాడి చేసే అవకాశాలు ఉన్నాయని నిఘావర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కేంద్రం అన్నిరకాలుగా సిద్ధం అవుతున్నది.  


ఇక ఇదిలా ఉంటె, కేంద్రం ఎన్ఆర్సి ని అమలు చేసేందుకు సిద్ధం అయ్యింది.  అస్సాంలో మొదటిసారి ప్రయోగాత్మకంగా ఈ ఎన్ఆర్సిని ప్రయోగించింది. అక్కడ చాలామందిని భారతీయులుగా గుర్తించలేదు.  వారికీ సంబంధించిన విషయాలను కేంద్రం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుంది.  ఇప్పుడు ఈ ఎన్ఆర్సి ని కేంద్రం దేశవ్యాప్తంగా ప్రయోగించేందుకు సిద్ధం అవుతున్నది.  దేశంలో ఎన్ఆర్సి ని ప్రయోగిస్తే.. అసలైన ఇండియన్ లు ఎవరు.. ఎవరు కాదు అని తేలిపోతుంది.  


ఎంతమంది ఎక్కడి నుంచి దేశంలోకి అక్రమంగా వలస వచ్చారు.  వారి వివరాలు ఏంటి అన్నది ఖచ్చితంగా తేలిపోతుంది.  కాబట్టి ఈఎన్ఆర్సి ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రభుత్వం సిదాం అయ్యింది.  అయితే, దేశంలోకి ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి వలస ఎక్కువగా వస్తున్నారు.  వారంతా బెంగాల్ లో నివాసం ఉంటున్నారు.  పైగా బెంగాల్ ప్రభుత్వం వారికి సహకరిస్తూ వస్తున్నది.  ఎన్ఆర్సి ప్రయోగిస్తే వారంతా తిరిగి సొంతదేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుంది. 


పొరుగు దేశాలకు సమాచారం ఇవ్వాలని, వారితో సంప్రదింపులు జరిపిన తరువాతే ఎన్ఆర్సిని ప్రయోగించాలని అలా చేయకుంటే దేశంలో ఉన్న వ్యక్తులు అన్యాయం అవుతారని ప్రతిపక్షాలు హెచ్చరించాయి.  ప్రతిపక్షాలు ఈ మాటలు అన్న 24 గంటల్లోనే బంగ్లాదేశ్ ప్రధాని ఎన్ఆర్సి వలన తమకు ఇబ్బంది లేదని, మద్దతు ఇస్తున్నట్టుగా  ఆమె పేర్కొన్నారు.  తమ దేశానికి చెందిన పౌరులను తిరిగి తీసుకెళ్లేందుకు తమకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు.  దీంతో ఎన్ఆర్సి పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు చెక్ పెట్టినట్టు అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: