మహారాష్ట్ర.. హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈనెల 21 వ తేదీన రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  ఇప్పటికే అన్ని పార్టీలు పొత్తుల విషయంలో ఓ కొలిక్కి వచ్చాయి.  మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజీపీ అధికారంలో ఉంది.  మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  మొన్నటి వరకు శివసేన.. బీజేపీలు కలిసి పోతూ చేస్తున్నా.. సీట్ల సర్దుబాటు విషయంలోనే కొంత గందరగోళంగా ఉన్నది.  


కాగా, నిన్నటితో పొత్తుకు సంబంధించిన అన్ని విషయాలు పూర్తయ్యాయి. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయానికి వచ్చాయి.  ఇక ఇదిలా ఉంటె, పొత్తు ఉన్న ప్రాంతాల్లో తప్పించి మిగతా ప్రాంతాల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు నామినేషన్లను వెనక్కి తీసుకోవాలని శివసేన అభ్యర్థులకు సూచించింది.  ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే.. చర్యలు తీసుకోవాల్సి వస్తుందని శివసేన చీఫ్ హెచ్చరించారు.  


ఇక మహాలో ప్రచారం ఊపందుకుంది.  అయితే, ఆయా పార్టీలు ఎంతమేరకు ప్రచారం చేస్తాయి అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. ప్రచారానికి వర్షం అంతరాయం కలిగించే విధంగా ఉన్నది.  గత కొంతకాలంగా మహారాష్ట్రను వర్షాలు అల్లడిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇంకా శిబిరాల్లోనే ఉన్నారు.  ఈ సమయంలో ప్రభుత్వంగానీ, ప్రతిపక్షాలుగాని అక్కడికి వెళ్లి ఎలా ప్రచారం చేయబోతున్నారు.  ప్రచారం చేస్తే ఏమని ప్రచారం చేస్తున్నారు.  ఒకవేళ జీబులు, ఇతర వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు పడవల్లో వెళ్లి ప్రచారం చేయాలనీ కూడా పార్టీలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.  


ఎంతగా ప్రచారం చేసుకుంటే అంతగా కలిసి వస్తుంది.  మహాలో ఫడ్నవిస్ ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదు.  పైగా జాతీయ భద్రత విషయంలో మోడీ చేస్తున్న కృషి.. ప్రజల కోసం ప్రవేశపెడుతున్న పధకాలు, మహారాష్ట్ర అభివృద్ధి వంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.  ఇప్పటికే మహారాష్ట్రలో 50శాతం బీజీపీ బలంగా ఉంది.  శివసేన మరో 25 నుంచి 30శాతం బలంగా ఉంది.  ఈ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా తిరిగి అధికారం కైవసం చేసుకుంటామని ధీమాగా చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: