తాత వేసిన బాటలో భయంకర పోరులో పోటీ చేసేందుకు సిద్ధమైన ఆదిత్య ఠాక్రే. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే మనవడు 29 ఏళ్ల వయసున్న ఆదిత్య ఠాక్రే ఈ సారి శివసేనకు తిరుగులేని ప్రాంతమైన  దక్షిణ ముంబైలోని వర్లి నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగనున్నారు.

ఆయననే భవిష్యత్ సీఎంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు సంబరాలు అంబరాన్ని అంటారు. ఇప్పటివరకు ఠాక్రే కుటుంబంలో ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు.
తమ అధీనం లో ప్రభుత్వాలను తిరుగులేని విధంగా శాసించారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటలేకపోయిన శివసేన ఈ సారి అధికారాన్ని  పొందడానికి ఆదిత్యను బరిలోకి దింపుతోంది.
   
ఉద్ధవ్‌ ఠాక్రే, రష్మి ఠాక్రే దంపతులకు ఆదిత్య 1990లో జన్మించారు. ముంబైలో బీఏ,ఎల్‌ఎల్‌బీ చేశారు. స్వతహాగా కవి, రచయిత అయిన ఆదిత్య తను రాసిన కవిత్వం మై థాట్స్‌ ఇన్‌ వైట్‌ అండ్‌ బ్లాక్‌ పేరుతో పుస్తకంగా వచ్చింది. తాను రాసిన ప్రైవేటు గీతాలతో ఉమ్మీద్‌ అనే ఆల్బమ్‌ని తీసుకువచ్చారు. ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లి ఆయన పేరు మారుమోగిపోయింది. 2010లో యువజన విభాగం చీఫ్‌గా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆదిత్య శివసేనపై తన ముద్ర వేయడానికి మొదట్నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటు వచ్చారు. సంప్రదాయ శివసేన భావాలను వదిలించుకొని ఆధునిక హంగుల్ని పులుముకొని వ్యూహాలు రచించారు.నగరాల్లో యువతను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా అహర్నిషలు కష్టపడి పనిచేసిన ఠాక్రే కుటుంబం.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పనుల్లో  పాల్గొన్నారు. గత ఏడాది ముంబైలో నైట్‌ లైఫ్‌ను తిరిగి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు లేఖ రాసి వార్తల్లోకెక్కారు. మాల్స్, రెస్టారెంట్లు రాత్రంతా తెరిచి ఉంచాలని ప్రతిపాదనలు చేశారు అవి  అమలు కానప్పటికీ మార్పు కోసం అంటూ నినాదిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు నడిపారు. వర్లి నియోజకవర్గంలో ఎంతో కాలంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ యువతరాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు కూడా చేసారు.చూద్దాం పూర్వ వైభవం వస్తుందో లేక పూర్వీకులుగా మిగిలిపోతారో .....

 

మరింత సమాచారం తెలుసుకోండి: