వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా పదవి చేపట్టిన అతి కొద్దికాలంలొనే ఆంధ్రరాష్ట్రంలోని ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వం లోనికి విలీనం చేశారు. ఇది ఆంధ్రులకు ఊరట నిచ్చినప్పటికిని తెలంగాణా ఆర్టీసి ఉద్యోగుల మది లో కొంత అలజడి కి కారణమైనది. తమని ప్రభుత్వం లోనికి తీసుకోవాలని.. తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభుత్వం చూపించాలని.. ఒక ఆవేదన ధోరణితో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు సమ్మెకు దిగారు. 

కానీ తెలంగాణా ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకునే అవకాశం ఉన్నప్పటికీని... సీఎం కేసీఆర్ మాత్రం... వేర్వేరు కారణాల వల్ల అలాంటి నిర్ణయాలకి తావివ్వట్లేదు. ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం అలా ఎందుకు ఒప్పుకోరంటూ పట్టుపడుతున్నారు. ఇప్పుడు దీనికి ఒప్పుకుంటే... రేపు తెలంగాణలో ఆటోడ్రైవర్లు, కార్ డ్రైవర్లు కూడా... ఏపీ సీఎం మాదిరి అక్కడి ఆటోడ్రైవర్లు, కారు డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేలు ఇస్తున్నట్లుగానే... తమకూ కూడా ఇవ్వాలని డిమాండ్ చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంచేత ఏటువంటి పరిస్థితుల్లోనూ ఏపీలో తీసుకునే నిర్ణయాల వంటివి తెలంగాణలో తీసుకోకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటోందనీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రజల గురించి ఆలోచించట్లేదనే విమర్శలు చేస్తున్నారు కొందరు. ఇక ఆర్టీసీ విషయానికి వస్తే... ఇప్పట్లొ ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెల ఊసు ఎత్తరు. ఒకవేళ ఎత్తిన... ప్రజలు ఉద్యోగులనే తిడతారు. ఎందుకంటే... ప్రభుత్వం వాళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించింది కాబట్టి... ఆర్టీసీ ఉద్యోగులకు అదే అతి పెద్ద వరం.

అంతకంటే ఇంకేం కావాలి అని ప్రజలంటున్నారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ కనుక ఒప్పుకున్నట్లయితే... ఆ క్రెడిట్... కేసీఆర్‌కి కాకుండా... జగన్‌కి వెళ్లే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల యోచన. ఇలా... జగన్ నిర్ణయాల ప్రభావం పొరుగు రాష్ట్రాల మీద ఎంతైన ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: