డిజిటల్ యూగంలో డిజిటల్ పాలనను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఎన్నో కొత్త కొత్త విధానాలను అమలులోకి తీసుకొచ్చింది. వాటిలో ఆర్టీజీఎస్‌ ఒకటి.రైతులకు ఉపయోగపడే విధంగా ఎప్పటికప్పుడు భూసార పరీక్షల ఫలితాలను ఆన్‌లైన్‌లో ఉంచడం, వాటి ద్వారా రైతులు వారి భూమి సారాన్ని బట్టి ఎలాంటి పంటలు వేసుకోవాలో సూచనలు ఇస్తున్న వైనాన్ని వివరంచారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వైలెన్స్‌ కెమెరాలను ఉపయోగించి నిఘా పర్యవేక్షణ, విపత్తలు, ప్రమాదాల సమయంలో  ప్రభుత్వం వేగంగా స్పందించేందుకు వీలుగా దీనిని రూపొందించారు. 


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్టోబర్ 24, 2017న ఆర్టీజీఎస్‌  కి సంబంధించిన జీవో విడుదల చేసింది ప్రభుత్వం.   2017 నవంబర్ 24న రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్‌)ను ఏపీ మాజీ ముఖ్య మంత్రి ప్రారంభించారు. దీని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ వెలగపూడిలోని సెక్రటేరియట్‌లో ఉంది.  నిఘా వ్యవస్థకు కూడా ఉపయోగపడేలా..... విపత్తులు తలెత్తినప్పుడు, ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రభుత్వం వేగంగా స్పందించటానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసారు.ఈ వ్యవస్థ ఏర్పాటైన ఏడాదిలోనే పౌరసరఫరాల శాఖకు రూ.1600 కోట్లు ఆదా అయ్యాయని సర్కారు ప్రకటించింది.


కాగా ఆర్టీజీఎస్ నిర్వహణ కోసం తొలి ఏడాది చంద్రబాబు సర్కారు రూ. 50 కోట్లు కేటాయించింది.   ఆర్టీజీఎస్ సీఈవో, ఆర్టీజీసీ సొసైటీ వినతి మేరకు వీఎంఎస్ ఇండస్ట్రీస్, హుబిలో సాఫ్ట్‌టెక్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలను సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ ఏజెన్సీలుగా నియమించడం కోసం రూ.9.80,98,824లు రిలీజ్ చేసినట్టు నాటి ప్రభుత్వం పేర్కొంది. కాగా కేవలం ఆర్టీజీఎస్ సోషల్ మీడియా ప్రమోషన్ కోసం ఏకంగా రూ. 9.81 కోట్లు ఖర్చు చేశారనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ఒక్క  సోషల్ మీడియా ప్రమోషన్ కోసం ఈ స్థాయిలో ఖర్చుపెట్టడం ఎవరికి లబ్ధి చేకూర్చడానికి అని ప్రశ్నిస్తున్నాయి.చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవారికి లబ్ధి చేకూర్చడం కోసమే సర్కారు కేవలం ఆర్టీజీఎస్ సోషల్ మీడియా ప్రమోషన్ కోసం దాదాపు రూ.10 కోట్లు మంజూరు చేసిందని.. ఈ విషయమై విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: