మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సంధిని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌,శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే శుక్రవారం వెల్లడించారు.సీట్ల సర్దుబాటు ఒప్పందం ప్రకారం శివసేన124 స్ధానాల్లో పోటీ చేస్తుండగా,బీజేపీ ఇతర చిన్న పార్టీలు కలిసి164 స్ధానాల్లో బరిలో దిగనున్నాయి.తనకు కేటాయించిన164 స్ధానాల్లో రిపబ్లికన్‌ పార్టీ,రాష్ట్రీయ సమాజ్‌ పక్ష,రాయల్‌ క్రాంతి సంఘటన వంటి చిన్న పార్టీలకు14 స్ధానాలను కాషాయ పార్టీ కేటాయించింది.సీట్ల సర్దుబాటును అధికారికంగా ప్రకటించిన సంయుక్త విలేకరుల సమావేశంలో శివసేన యూత్‌ ప్రెసిడెంట్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొనడం విశేషం.

కాగా ఆదిత్య ఠాక్రే వర్లి నుంచి భారీ ఆధిక్యంతో గెలుపొందుతాడని మహారాష్ట్ర సీఎం,సీనియర్‌ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ-సేన కూటమి అధికారంలోకి వస్తే శివసేన సీఎం అభ్యర్థిగా ఆదిత్య ఠాక్రే ముందువరుసలో ఉంటాడని భావిస్తున్న క్రమంలో ఉద్ధవ్‌ ఠాక్రే స్పందిస్తూ రాజకీయాల్లోకి రాగానే ముఖ్యమంత్రి కావాలనుకోవడం అర్ధం లేనితనం అని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఆదిత్య ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాడని, ఇది ఆరంభం మాత్రమేనని ఇంకా అతను చూడాల్సింది చాలా ఉంది అని అప్పుడే సీ.ఎం అయితే అతని అనుభవానికి సరైంది కాదని అందుకే ఒకసారి ఆలోచించుకుంటాం అని కూడా తెలియచేశారు.ఈ విధంగా కమలదళం చేస్తున్న స్క్రీన్ ప్లే ఎవరికి లాభం చేకూరనుందో ఆసక్తికరమైన సంఘటనగా మారిపోయింది.ఏదేమైనా మొత్తం అధికారాన్ని శివసేనకు కట్టబెట్టేలా వ్యూహాలు రచించడం గమంచినాల్సిన విషయం.ఆదిత్య ఠాక్రే కి అదృష్టం దక్కుతుందా లేదా అనే విషయాన్ని గురుంచి మహారాష్ట్ర అంతా హాట్ టాపిక్ గా మారిపోయింది.అటు సీనియర్స్ లోను ఇటు జూనియర్స్ లోను  విజయం ఎవరికి దక్కేనో అని  ఉత్కంఠ నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: