మానుషాలకు విలువలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. తల్లిదండ్రులు, అక్క చెల్లలు అన్న తేడా లేకుండా ఈ తరం యువత ప్రవర్తిస్తుంది. ఒకప్పుడు తండ్రి అంటే భయం, తల్లి అంటే మొండితనం, అక్కచెల్లలు అంటే ప్రేమ అనురాగాలు ఉండేవి.. కానీ ఇప్పుడు మాత్రం ఏది లేదు. తల్లిదండ్రులు ఏమి ఇవ్వక పోయిన తప్పే. ఆన్లైన్ గంటలకు బానిసలై అరాచకాలు చేస్తున్నారు.             


టీవీలు, మొబైల్స్, కంప్యూటర్ వంటి వాటికి ఎడిక్ట్ అయిపోయి అవి లేని సమయంలో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. కాలక్షేపం కోసం ఉపయోగించే వాటితో కాలం గడుపుతు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అవి ఒద్దు వాడకండి అని వారిస్తే తల్లితండ్రులైన సరే వారిని ముక్కలుముక్కలుగా నరికి చంపేస్తున్నారు. 


అయితే ఇంకా విషయానికి వస్తే.. ఓ యువకుడు రిమోట్ కోసం గొడవపడి కన్నతండ్రినే చంపేశాడు. ఈ ఘటన మన తెలంగాణలోని నల్గొండ జిల్లాలోనే జరిగింది. పెరుమాళ్ల గోవర్ధన్, అతని కొడుకు సతీష్‌తో కలిసి నల్గొండ జిల్లాలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గోవర్ధన్ కూలి పనులకు వెళుతుంటాడు. సతీష్ అదే జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 


రాత్రి సమయంలో టీవీ రిమోట్ కోసం ఇద్దరూ గొడవ పడ్డారు. అయితే మద్యం మత్తులో ఉన్న సతీష్ ఆవేశం పట్టలేక రోకలిబండతో తండ్రి తలపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో ఆ తండ్రి అక్కడికక్కడే కుప్పకూలి తండ్రి మృతి చెందాడు. అది తెలియని సతీష్.. రక్తపు మడుగులో ఉన్న తండ్రి పక్కనే పడుకున్నాడు. ఉదయం లేచే సమయానికి తండ్రి చనిపోయి ఉండటంతో స్థానికులకు విషయాన్ని చెప్పగా వారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: