ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ మోడీతో దోస్తీకి ప్రయత్నిస్తున్నారా.. ఎలాగైనా మళ్లీ మోడీని ప్రసన్నం చేసుకోవాలని రాయబారాలు నడుపుతున్నారా.. ఓవైపు కేసుల భయంతో ఎలాగైనా మోడీని శరణువేడుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.వీలైనంత త్వరగా ప్రధానిని ప్రసన్నం చేసుకోకుంటే తన కేసులు, తన పార్టీ ఎంపీల పై ఉన్న కేసులూ కదలి కంఠానికి బిగుసుకుంటాయన్న బెంగ చంద్రబాబును నిద్రపోనీయడంలేదంటున్నారు.


బీజేపీలోకి గంపగుత్తిగా చేరిన ఎంపీలు వీలైనంతగా చంద్రబాబు భజన చేస్తూ, కుల నాయుడి సాయంతో మరోసారి మోదీ ప్రాపకం సాధించి బాబు మోదీల బంధం కలిపేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారట. కానీ తన వందరోజుల పాలన తర్వాత కేబినెట్ విస్తరణ చేస్తున్న ప్రధాని మోదీ జంపిగ్ జపాంగ్ లకు స్థానం లేదని తేల్చేసారట. దాంతో సీఎం రమేష్, సుజనా చౌదరి పప్పులు ఉడకన‌ట్టైంది. వీళ్లిద్దరి సాయంతో వెంకయ్యనాయుడి సిఫార్సులతో మళ్లీ మోదికి దగ్గరవ్వాలన చంద్రబాబు ఆశలు అడియాశలే అయ్యాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.


నోటికొచ్చినట్టు తిట్టి, తన మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రధానిని విచక్షణా రహితంగా తిట్టించిన చంద్రబాబు గతాన్ని మర్చిపోయి, తన అవసరానికి కాళ్లబేరానికి వచ్చుండచ్చు. కానీ బాబును క్షమించే ఉద్దేశ్యం మోదీకి లేదని తేటతెల్లం అయిపోయిందట. బ్యాంకు దొంగ సుజనా, బినామీ సీఎం రమేష్ లు కేసుల విముక్తి సంగతేమో కానీ బీజేపీ నేతలు చాలామంది వీరిపై గుర్రుగా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.


బీజేపీలో చేరినంత మాత్రాన నేరస్థులు సచ్ఛీలురు కాలేరంటూ ఎద్దేవా చేస్తున్నారు కమలం నేతలు. టీడీపీ నుంచి ఫిరాయించిన ఎంపీలు తమపై ఉన్న కేసులను, విచారణలను ఎదుర్కోవాల్సిందే అన్నారు బీజేపీనేత విష్ణువర్థన్ రెడ్డి. బీజేపీ నేతల సంగతి ఉన్నా...తాను ఏదోలా మోడీ ప్రాపకం సంపాదించాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: