టీవీ-9 ఇది ఒక తెలుగు ప్రముఖ వార్త ఛానెల్.ఈ ఛానల్ పేరు తెలియని వారు ఎవరు ఉండరు.అదే న్యూస్ ఛానెల్ లో ఒకప్పటి సీఈవో గా పని చేసిన రవిప్రకాష్ అందరికీ సుపరిచితులే. టీవీ9 ఖ్యాతిని పెంచటానికి ఆయన చేసిన కృషి అనిర్వచనం.జనాల మనసుల్లో ఒక మంచి స్థానన్ని పొందిన రవిప్రకాష్ గారు నేడు పోలీసు వారి అదుపులో వుండటం కాస్త ఆశ్చర్యం. 
వివరాల్లోకి వెళితే టీవీ9 మాజీ సీఈఓ గా పని చేసిన రవిప్రకాష్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా అజ్ఞాతవాసం చేస్తున్నరవిప్రకాష్ పై సంతకాలు ఫోర్జరీ చేశారని, నిధులు గోల్ మాల్ చేశారని టీవీ9 వారు కేసులు నమోదు చేయించడం జరిగింది,ఈ విషయంలో అతన్ని పలుమార్లు పోలీస్ వారు విచారించారు.కాగా టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో నిధుల గోల్ మాల్ కు పాల్పడటమే కాకుండా టీవీ 9 లోగోని కూడా అమ్మారని రవిప్రకాశ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోఇప్పటికే 2 కేసులు వరకు నమోదయ్యాయి.
ఈ విచారణలో భాగంగా టీవీ 9లో సోదాలు చేసేందుకు వెళ్లిన పోలిసుల్ని అడ్డుకుని వారి విధులకు ఆటంకం కలిగించారని రవిప్రకాశ్ పై కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్ అక్రమాలకు పాల్పడ్డారని టీవీ9 యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసులు నమోదు చేసిన సమయంలో పోలీసువారు విచారణకు హాజరుకావాలని రవిప్రకాశ్ ని హెచ్చరించినప్పటికిని వారు హాజరుకాకపోవటంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్లకు చెప్పకుండా ఎలాంటి అనుమతి లేకుండా ఏబీసీఎల్ బ్యాంక్ నుంచి రూ.18కోట్ల నిధులను రవిప్రకాశ్ తన సొంతానికి వాడుకున్నట్టు అలంద మీడియా సంస్థ వారు సెప్టెంబర్ 4న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆతనితో పాటు టీవీ9 మాజీ సీఎఫ్ వో ఎంకేవిఎన్ మూర్తిపైనా కంప్లైంట్ చేశారు,పోలీసులు రవిప్రకాశ్ పై సంతకాలు ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: