దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఎస్బీఐ ఏటీఎంలలో ఇకనుండి 2వేల రూపాయల నోట్లు రావు. ఎస్బీఐ ఈ నిర్ణయం ఆర్బీఐ సూచనల మేరకు తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్బీఐకు చెందిన అన్ని ఏటీఎంలలో 2 వేల రూపాయల నోట్లు పెట్టే క్యాసెట్లను తొలగించిందని తెలుస్తోంది. కేవలం ఎస్బీఐ ఏటీఎంలలో 500 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయల నోట్లు మాత్రమే వస్తాయి. 
 
భవిష్యత్తులో ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలలో 500 రూపాయల నోట్లు కూడా రావని తెలుస్తోంది. కేవలం 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు మాత్రమే ఎస్బీఐ ఏటీఎంలలో ఉంచే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎస్బీఐ ఏటీఎంలలో కేవలం చిన్న నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితులను కూడా పెంచబోతుందని తెలుస్తోంది. 
 
మెట్రో నగరాల్లో ఎస్బీఐ ఏటీఎం ఉపయోగించి 10 సార్లు, మిగతా ప్రాంతాలలో 12 సార్లు ఉచిత ఏటీఎం లావాదేవీలు చేసే విధంగా ఎస్బీఐ చర్యలు తీసుకోబోతుందని సమాచారం. కొన్ని రోజుల క్రితం ఎస్బీఐ ఖాతాదారులు ఉపయోగించే ఏటీఎం కార్డులను బట్టి రోజుకు 1,00,000 రూపాయల వరకు నగదు విత్ డ్రా చేసుకునేలా చర్యలు చేపట్టింది. ఎస్బీఐ ప్లాటినం కార్డు ఉపయోగించే ఖాతాదారులు రోజుకు ఏటీఎం నుండి 1,00,000 రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.

ఖాతాదారుడు ఉచిత లావాదేవీలు పూర్తయిన తరువాత కూడా లావాదేవీలు నిర్వహిస్తే బ్యాంకు కొంత డబ్బును పెనాల్టీగా తీసుకుంటుంది. ఖాతాలో తగినంత డబ్బు లేకుండా లావాదేవీలను నిర్వహించటానికి ప్రయత్నిస్తే కూడా ఎస్బీఐ ఛార్జీలను విధిస్తుందని తెలుస్తోంది. ఎస్బీఐ ఏటీంఎలలో 2 వేల రూపాయల నోట్లు అందుబాటులో ఉండకపోవటంపై వినియోగదారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 



 



మరింత సమాచారం తెలుసుకోండి: