రాష్ట్రంలో చాలామంది ఆన్‌లైన్ రమ్మీపై దృష్టిపెట్టారు. ఎందుకనగా పేకాటపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది కాబట్టి, దీంతో చాలా మంది ఆన్‌లైన్ రమ్మీ ఆడుతున్నారు. ఇకపోతే పేకాటలో ఎంత నైపుణ్యం ఉన్నా, ఆన్‌లైన్ రమ్మీలో రాణించడం కష్టం. ఎందుకంటే ఆన్‌లైన్ రమ్మీ నిర్వహించే సంస్థలు ఎప్పటికప్పుడు ప్రోగ్రాంలో మార్పులు చేస్తూ ఆడేవారు విజయం సాధించకుండా ఉండేందుకు ఎత్తులు వేసే అవకాశాలున్నాయి. ఆన్‌లైన్ రమ్మీ ఆడి కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకున్న చాలామంది లబోదిబోమంటున్నారు. ఇకపోతే ఆన్‌లైన్ రమ్మీ ఆటలోకి కస్టమర్లను ఆకర్షించేందుకు ఆట ప్రారంభంలో డబ్బులు ఇచ్చినట్లే చేసి, ఆన్‌లైన్ రమ్మీ ఆటపై వినియోగదారులకు మోజు పెంచుతారు నిర్వాహకులు...


ఇలా చాలామందికి ఇది వ్యసనంగా మారడంతో ఆన్‌లైన్ రమ్మీసైట్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు.ఇలా సదరు వినియోగదారుడు ఆన్‌లైన్ రమ్మీపై నమ్మకం పెంచుకొని దానికి బానిసవుతున్నాడు.జీవితాన్ని పాడుచేసుకుంటున్నాడు.ఇలా ఆన్‌లైన్లో పేకాట ఆడిన ఓ వ్యక్తి ఏకంగా రూ.78లక్షల కోల్పోయి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన క్రునాల్ మెహతా (39) ఆన్‌లైన్లో పేకాటకు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు.మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.


ఈ క్రమంలోనే అతడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా గదిలో సూసైడ్ నోట్ లభించింది.ఆ లేఖలో పేకాటలో రూ.78లక్షలు పోగొట్టుకున్నానని, ఈ ఆట ఆడటానికి బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల దగ్గర నుంచి లక్షల రూపాయల అప్పులు చేసానని,వాటిని తీర్చే మార్గం కనిపించక, అప్పు ఇచ్చిన వారికి మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో రాశాడు.ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగాంగా అతడి బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీయగా చాలామంది క్రునాల్ తమవద్ద రూ.లక్షల్లో అప్పులు చేసినట్లు చెప్పారు.ఇక ఈ విషయంలో పోలీసు అధికారులు మాట్లాడుతు ఆన్‌లైన్ గేమ్ అనేది ఒక జూదం. దీనికి అలవాటైతే ఉన్నదంతా పొగొట్టుకోవాల్సి వస్తుంది.కాబట్టి వ్యసనానికి బానిస కావద్దని సూచిస్తున్నారు. ఇకపోతే ఆన్‌లైన్ రమ్మీపై నిఘా కట్టుదిట్టం చేయనున్నాం అని వెల్లడించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: