తెలుగు రాష్ట్రాల్లో ప్రజల  సమస్య ఏదైనా ఒక్కసారి పవన్ నోటి వెంట నినాదం వినబడితే ఆ సమస్యకు కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వెనకడుగు వేయాల్సిందే అది పవన్ పవన్ సత్తా.
నల్లమలలో యురేనియం తవ్వకాలకు సంబంధించిన పిలుపే....... ఇందుకు నిదర్శనం. ఇటీవల నల్లమలలో యురేనియం తవ్వకాలకు సంబంధించి కూడా వీహెచ్ పవన్ కళ్యాణ్ మద్దతు కోరింది.
సేవ్ నల్లమల అంటూ ఒక్కసారి పిలుపునిచ్చారు ఇంకేముంది.....అభిమానులు,కార్యకర్తలతో పటు అందరు ఈ ఉద్యమానికి తోడుగా నిలిచారు.


 జనసేనాని స్పందనతో సెలబ్రిటీలు కూడా వరుసగా సేవ్ నల్లమల అంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమం చేపట్టారు. చివరికి  ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు . యురేనియం తవ్వకాలకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, ఇవ్వబోమని కూడా  అసెంబ్లీ సాక్షిగా  తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అది పవన్ మానియా. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కేరళలో వెన్నునొప్పికి ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి సమయంలో  హుజూర్ నగర్ ఉప ఎన్నిక జనసేనానిని సంకట స్థితిలో పడే పరిస్థితి తీసుకొచ్చింది. 
ఎందుకంటె గతంలో నల్లమల కు మద్దతు ప్రకటించాలని కోరింది కూడా కాంగ్రెస్ వర్గీయులే.


హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు జనసేనానిని కోరారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి జనసేన తెలంగాణ ఇంచార్జ్ ఎన్.శంకర్ గౌడ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ లతో చర్చించారు. దీనిపై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు  కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడమా?  తిరస్కరించడంమా అంటూ పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారు.


 కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే.. గతంలో నల్లమల వ్యవహారాన్ని కూడా కలిపుకొని.. జనసేన పార్టీ కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యారని జనం భావించవచ్చు. ఇప్పటికే ఆర్టీసీ కార్మిక సంఘాలతో వ్యవహరించిన తీరుకు జనం  కేసీఆర్‌ పై గుఱుగ ఉన్నారు. ఈ సమయంలో జననాని పిలుపునిస్తే  కాంగ్రెస్ గెలవడం ఖాయం. అది కేసీఆర్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఒకవేళ ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్..  ఈ అద్భుత అవకాశాన్ని ఎందుకు మిస్ చేశాడనే విమర్శలు వస్తాయి.  2018 అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఎవరికీ మద్దతు ప్రకటించకుండా తటస్తంగా ఉండిపోతే.. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఏదైనా పోరాటాన్ని భుజానికి ఎత్తుకుంటే ఏ పార్టీ నుంచి కూడా సహకారం అందదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే ఇరకాటంలో పడిపోయారు పవన్ కళ్యాణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: