ఇప్పుడు తెలంగాణా లో ఆర్టీసీ సమ్మె ఉద్యమంలా మారేలా కనిపిస్తుంది. ఇదే సమయంలో సమ్మె పైన సామాన్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుతున్నాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమను ఆదుకోవాలని అంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ ఎస్మా ప్రయోగిస్తాం అన్నప్పటికీ లెక్కచేయకుండా వారి డిమాండ్లను నెరవేర్చాలని పోరాడుతున్నారు ఆర్టీసీ కార్మికులు.


ప్రస్తుతం ప్రభుత్వం..కార్మిక సంఘాలు ఇద్దరు కూడా  మొట్టు దిగటం లేదు తెలంగాణ సాధన కోసం నాడు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేసిన సమయంలో ఆర్టీసి కార్మికులు సైతం ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు.ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు భిన్న వర్గాల నుండి కూడా మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులకు సంఘీభావంగా భిన్న వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. 
ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించాయి.


తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సైతం సంఘీభావం తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  కేవలం మాటలకే పరిమితం కాకుండా నేరుగా రంగంలోకి దిగేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులతో పాటు అటు రెవెన్యూ ఉద్యోగులు సైతం కేసీఆర్ సర్కారుపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా పెన్ డౌన్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


దీనికి అటు ప్రభుత్వ ఉద్యోగులు సంఘాలతో పాటు, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సెలవులు కొనసాగుతున్నాయి.  అయితే పండుగ అనంతరం ఉపాధ్యాయులు, కార్మికుల ఐక్యకార్యాచరణ సమితి(జేఏసీ) దీనిపై ఉద్యోగ సంఘాలన్నీ సమావేశమై ఏకాభిప్రాయం మేరకు నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం.ఒక ఆర్టీసీ కార్మికుల తోనే సమ్మె ఇంత ఉధృతంగా ఉంటే అన్ని వర్గాలు కలిసి పోరాడితే తెలంగాణాలో ఉద్రిక్త పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: