ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు ... అధికారులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి  ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదు. ప్రజలు పనులు మానుకొని కాళ్లరిగేలా తిరిగినా కూడా వాళ్ల పనులు కావడం లేదు.ఈ నేపథ్యంలో  నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

 

 

 

 

 

 చనిపోయిన తన భర్త పేరు మీద ఉన్న భూమి తన పేరును మార్చాలని మార్చాలని రెవిన్యూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా కూడా పని జరగలేదు... కలెక్టర్ కార్యాలయంలో ఎన్నోసార్లు వినిపించినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు దీంతో మనస్తాపం చెందిన మహిళ కలెక్టర్ కార్యాలయం లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది ఈ  ఉదంతం. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం మమ్మాడిరెడ్డిగుంట  గ్రామానికి చెందిన ఓ  మహిళ భర్త దురదృష్టవశాత్తు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తన భర్త పేరు మీద ఉన్న భూములు అన్నింటిని... తన పేరు మీదకు మార్చాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగింది మహిళ. 

 

 

 

 

 

 రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగి తన భర్త పేరు పై ఉన్న భూమిని తన పేరు మీదకి మార్చాలని విజ్ఞప్తి చేసినప్పటికీ రెవిన్యూ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వివరించారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న మహిళా తన బాధ అక్కడ చెప్పుకున్నప్పటికీ అక్కడ ఫలితం కనిపించలేదు. ఇక చాలాసార్లు కలెక్టరేట్ కి  వచ్చి తన బాధ చెప్పుకున్నప్పటికీ అక్కడ అధికారులు స్పందన కరువైంది. దీంతో విసుగు చెందిన మహిళ కలెక్టరేట్ కి  వెళ్లి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేసింది. అయితే కాసేపటికి కళ్లు తిరిగి కింద పడిపోవడంతో గమనించిన అక్కడి సిబ్బంది హుటాహుటీన  ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఆ మహిళ ప్రాణాలతో బయట పడింది. అయితే ఆస్తి పత్రాలు పేరు మార్చే సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే విసుగెత్తి ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అని ఆమె తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: