ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో.. ఆ ప్రదేశం.. ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది.  అందంగా ఉంటుంది.. అద్భుతంగా ఉంటుంది.  ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది.  కానీ, ఇప్పడు కాలం మారింది.  కాలం మారడంతో.. మహిళలను చిన్న చూస్తున్నారు.  అంతేకాదు, మహిళలపై ఇటీవల కాలంలో అత్యాచారాలు ఎక్కువుగా జరుగుతున్నాయి.  గత 40 సంవత్సరాల నుంచే ఇలా జరుగుతున్నది.  


బ్రిటన్ లో  30 సంవత్సరాల క్రితం 11 సంవత్సరాల ఓ చిన్నారి తన స్నేహితుడిని నమ్మి ఇంటినుంచి బయటకు వచ్చింది.  అలా బయటకు వచ్చిన ఆ చిన్నారిని యువకుడు ఓ ముసలాయనకు పరిచయం చేసింది.  ఆ ముసలాయన ఆ చిన్నారిని ఓ ముఠా దగ్గరికి తీసుకెళ్లారు.  అభం శుభం తెలియని ఆ చిన్నారిని ముఠాలోని 10 మంది అత్యాచారం చేశారు.  దీంతో పాపం ఆ చిన్నారి విలవిలలాడిపోయింది.  ఆ తరువాత అక్కడి నుంచి ఆ ముసలాయన మరో చోటకి తీసుకెళ్లగా అక్కడ కూడా ఆ యువతిపై కొందరు అత్యాచారం చేశారట.  


అక్కడి నుంచి ఆ చిన్నారి తప్పించుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైట్ చేస్తే.. ముసలాయను అరెస్ట్ చేసి వెంటనే రిలీజ్ చేశారు.  తనపై అత్యాచారం చేసిన వ్యక్తులపై కేసు పెడితే.. పోలీసులు ఆమెను కటకటాల్లో పెట్టారట.  అంతేకాదు, కేసు వాపస్ తీసుకోవాలని ఒత్తిడి తీసినట్టు ఆమె తెలిపింది.  అనంతరం పోలీసులు కూడా ఆమెపై అత్యాచారం చేశారట.  దాదాపు ఏడేళ్లపాటు ఆమెకు నరకం చూపించారట.  


అంతేకాదు ఆమెను కారులో దేశం మొత్తం తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేశారట. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని ఒంటరిగా బతకడం నేర్చుకుంది.  40  ఏళ్ళు.  ఓ బిడ్డకు తల్లి.  బ్రిటన్ చరిత్రలో ఒక మహిళపై అన్నిసార్లు అత్యాచారం జరగడం అదే మొదటిసారి అని పోలీసులు చెప్తున్నారు.  ప్రస్తుతం ఆమె కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.  సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఆమెపై అత్యాచారం చేసిన నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: