భారతదేశంలో కాంగ్రెస్‌ పార్టీ మొత్తానికే తుడిచిపెట్టుకుపోయిందని.. కాల్షియం ఇంజెక్షన్‌ ఇచ్చినా.. ప్రయోజనం ఉండదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒవైసీ మాట్లాడుతూ.. ‘దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని., ఆ పార్టీలో జవసత్వాలు పూర్తిగా నశించాయని., అందుకే ఆ పార్టీ మహారాష్ట్ర - హరియాణ అసెంబ్లీ ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని., ప్రస్తుతం తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకీ కాల్షీయం ఇంజెక్షన్‌లు ఇచ్చినా దండగే’ అని ఒవైసీ ఎద్దేవా చేయసాగారు. ఈ క్రమంలో బీజేపీపై కూడా అసదుద్దీన్‌ విమర్శల వర్షం కురిపించారు.

ఇకనుంచి ఏ వ్యక్తయిన సరె మతం మార్చుకోవాలి అనుకుంటే.. నెల రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాల్సిందేనని హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం వారు నూతన ఆదేశాలు జారీ చేసిన సంగతి మనకి తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఒవైసీ దీనిని హెచ్చరిస్తూ.. హిమాచల్‌కు మాత్రమే పరిమితమైన ఈ బిల్లును మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేయడం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమి లేదంటూ భా.జా.పా మీద కూడా ఎద్దేవా చేయసాగారు. 2014 ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో రెండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరి ఈ ఎన్నికల్లో బీజేపీ.-శివసేన., ఎన్. సి.పి.- కాంగ్రెస్., మన ఒవైసీ లలో ఎవరు గెలుస్తారో చూడాలి.
రాబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒవైసీ గారు తన ప్రచార జోరు సాగిస్తున్నారు..,, మరి విజయలక్ష్మి వారిని వరిస్తుందో... లేదో...,, ఈసారి కాల్షియం ఏ పార్టీ వారు ఇస్తారో... ఎవరు తీస్కుంటారో...,,,, ఇలాంటి ఎన్నో ప్రశ్నల సమాధానం కోసం ఎన్నికల వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: