కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత జరిమానాలు భారీగా పెరిగిపోయాయి.  జరిమానాలు పెరిగిపోవడంతో.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రజలు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు.  అంతేకాదు, వాహనానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ను జాగ్రత్తగా దగ్గర ఉంచుకొని ప్రయాణం చేస్తున్నారు. 


హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే.. ఇప్పుడు పెద్ద నేరంగా పరిగణిస్తున్నారు.  ఇదిలా ఉంటె, ఇటీవలే ఉత్తరప్రదేశ్ లో మహారాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కైంద్వా అనే గ్రామానికి వెళ్ళాడు.  అయితే, అక్కడ హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తిని గమనించిన ట్రాఫిక్ ఎస్సై జరిమానా కట్టాలని పట్టుబట్టాడు.  తాను పొలంలో మాత్రమే బండి నడుపుతున్నానని చెప్పినా వినలేదు.  జరిమానా రసీదు అందించాడు.  


అయితే, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కూడా తలకు  హెల్మెట్ లేకుండానే రావడంతో ఆయన్ను కూడా చలానా కట్టాలని డిమాండ్ చేశారు. చలానా కట్టాలని డిమాండ్ చేసినా పోలీసులు ఒప్పుకోలేదు.  చివరకు గ్రామస్తులంతా అక్కడికి వచ్చి ఒత్తిడి తీసుకురావడంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చలానాను కట్ చేశారు.  హెల్మెట్ పెట్టుకోలేదని గ్రామస్తుడికి జరిమానా వేస్తె.. గ్రామస్తులంతా కలిసి పాపం ఆ ఇన్స్పెక్టర్ కు జరిమానా విధించారు.  


ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోమికల్ మీడియాలో వైరల్ గా మారింది. కైంద్వా గ్రామస్తులు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.  ప్రతి ఒక్కరు కూడా అలాగే ధైర్యంగా ఉండాలని, రూల్స్ అన్నది ప్రతి ఒక్కరికి వర్తిస్తాయని, హెల్మెట్ పెట్టుకోవాలని ప్రజలకు చెప్పే ముందు సదరు పోలీసులు కూడా ఆ పద్దతిని పాటించాలని, ప్రజలకు ఒక రూలు, మిగతా వాళ్లకు మరొక రూలు ఉండకూడదని నెటిజన్లు అంటున్నారు.  మొత్తానికి ఈ న్యూస్ వైరల్ కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: