ఏక్ టాయిలెట్ ప్రేమ్ కథ సినిమాలో అత్తారింటికి వచ్చిన మహిళ అత్తగారింట్లో టాయిలెట్ లేదని చెప్పి పుట్టింటికి వెళ్తుంది.  ఆ తరువాత అక్షయ్ కుమార్ ఏం చేశారు.. ఎలా టాయిలెట్ ను నిర్మించారు అన్నది కథ.  సమాజానికి ఉపయోగపడే విధంగా సినిమా ఉండటంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈ సినిమా స్పూర్తితో చాలామంది టాయిలెట్లను నిర్మించుకున్నారు.  చాలామంది మహిళలు టాయిలెట్స్ లేవని పెళ్లిళ్లు చేసుకోవడం లేదు.  


ఒకవేళ పెళ్లి చేసుకొని ఊరికి వెళ్తే.. అక్కడ టాయిలెట్ లేకపోతె.. తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు.  అత్తగారింట్లో టాయిలెట్ నిర్మించే వరకు ఆ ఇంటికి వేళ్ళని మహిళలు ఎందరో ఉన్నారు.  వివేకానికి ఇదొక నిదర్శనం.  ఈ కాలంలో కూడా చెరువుగట్టుకు వెళ్లడం అంటే పరువుకు సంబంధించిన విషయం అవుతుంది.  దానికి ఎవరూ ఒప్పుకోవడం లేదు.  


ఇలాంటి సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ లో జరిగింది.  బింద్ జిల్లాలోని పూప్ గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళా అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహగాం గ్రామానికి చెందిన పంకజ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది.  పెళ్లి అనంతరం ఆ మహిళ మెహగాం గ్రామానికి వెళ్ళింది.  అత్తగారింట్లో టాయిలెట్ లేదు.  టాయిలెట్ లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో ఆమెకు తెలియలేదు.  టాయిలెట్ కోసం రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది.  


అక్కడి పరిస్థితులు చూసి భయపడి.. మూడో రోజే తన పుట్టింటికి వెళ్ళిపోయింది.  టాయిలెట్ కట్టించే వరకు కాపురానికి రానని తెగేసి చెప్పింది. టాయిలెట్ కట్టించకుంటే విడాకులు తీసుకుంటానని చెప్పింది.   దీంతో మెహగాంకు చెందిన పంకజ్ ఇంట్లో టాయిలెట్ కట్టించాలని అనుకున్నారు.  ఈ విషయం ఆనోటా ఈనోటా ద్వారా అధికారులకు తెలిసింది.  వెంటనే అధికారులు జ్యోతి అత్తగారింట్లో మరుగుదొడ్డి నిర్మించమే కాకుండా... ఆమెను స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: