జగన్ అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే మనిషి అని అందరికీ తెలిసిందే. మాటలు కంటే చేతలు పైనే జగన్ ద్రుష్టి పెడతారని కూడా అందరూ చెబుతారు. ఆడంబరాలు, ఆర్భాటాలు జగన్ కి గిట్టని పనులు. తాను చేసిన పని మాట్లాడాలని జగన్ అనుకుంటారు. అంధ్రులు గర్వించే   నిర్ణయం  తీసుకుంటానని తరచూ చెప్పే జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తొందరలోనే ఆ శుభవార్త వైసీపీ సర్కార్ చెప్పనుంది.


ఉమ్మడి ఏపీకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది ఒక పండుగ లాంటిది.  ఆ రోజున మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి చూసుకుని అభివ్రుధ్ధిని సమీక్షించుకుని అడుగులు వేసేందుకు దోహదపడుతుంది. అంతే కాదు. మన రాష్ట్రం గురించి త్యాగం చేసిన మహనీయులను తలచుకోవడం, వారి దారిలో ప్రయాణించడం ఇలా అన్నీ ఆ రోజున ప్రమాణాలు  చేస్తాం. ఇక కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రకు అవతరణ దినోత్సవం లేకుండా చేసిన ఘనత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుది.



తెలంగాణా ఏపీ విడిపోతే జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తూంటే ఏపీ మాత్రం ఎడుపుగొట్టు రాజకీయాలకు తెరలేపేలా నాటి సీం బాబు చేశారు. ఇక ఏపీకి ఏది అవతరణ్ దినోత్సవం అని నాటి  టీడీపీ స‌ర్కార్ కేంద్రాన్ని కూడా అడిగింది.  దానికి బదులుగా కేంద్రం నవంబర్ 1న చేసుకోమని కూడా సూచించింది. అయినా సరే నవంబర్ 1న చేయలేదు నాటి టీడీపీ ప్రభుత్వం. మరి ఇపుడు ఆ పనిని చేసి చూపించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.


ఈ నేల 16న జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. దీంతో ఎప్పటి మాదిరిగానే ఇకపై ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1న నిర్వ‌హిస్తారన్న మాట. ఇది ఓ విధంగా  ఆంధ్రుల గుండెలు ఉప్పొంగే సమయం. ఆంధ్ర జాతి పండుగ దినం. దీన్ని సాకారం చేస్తున్న జగన్ కి ఆంధ్రులు ధన్యవాదాలు చెప్పాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: