కాంగ్రెస్ పార్టీలో కొత్త కుట్ర జ‌రుగుతోందా? అంత‌ర్గ‌త ఎత్తుగ‌డ‌ల రూపంలో...కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టే ప్ర‌క్రియ సాగుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విపాసన ధ్యానం నిమిత్తం కాంబోడియా వెళ్లారన్న వార్త ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాహుల్ సన్నిహిత నేతలు ప్రస్తుతం పార్టీలో సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడం యువనేతల్లో అయోమయానికి కారణమవుతుండ‌గా విశ్లేష‌కులు మాత్రం...దీని వెనుక అంతర్గత కుట్ర అనే మాస్టర్‌ప్లాన్ వేశారని భావిస్తున్నారు.


ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఉండడమే కాకుండా, రాహుల్ టీం.. పార్టీలో టార్గెట్ అవుతున్నది. పార్టీలో ఉన్న చాలామంది జూనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. భవిష్యత్తుపై వారిలో అయోమయం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ఎందుకు విదేశీ పర్యటనకు వెళ్లారు? ఎందుకు ఆయన మౌనం వహిస్తున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని వెనుక రాహుల్ టీం స్కెచ్ ఉందంటున్నారు. వారి వెనుక కాంగ్రెస్ ముఖ్య‌నేత సోనియాగాంధీ ఎత్తుగ‌డ ఉందంటున్నారు.  అశోక్ తన్వర్, సంజయ్ నిరుపమ్, ప్రద్యుత్ దెబర్‌మాన్ తిరుగుబాటు చెబుతున్నది ఒక్కటే.. పార్టీలో వృద్ధ నేతలు యువనేతలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని. మరోమాటలో చెప్పాలంటే.. సోనియా కోటరీ.. రాహుల్ సన్నిహితులను తప్పిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ ఆకస్మిక పర్యటన వారిని విస్మయపరుస్తున్నది.  రాహుల్ విపాసన కార్యక్రమం.. ఆయన సెకండ్ ఇన్సింగ్స్‌కు ప్రారంభమని నేతలు పేర్కొంటున్నారు.


ప్ర‌స్తుతం సీనియర్లపై తీవ్ర విమర్శలు చేస్తూ యువనేతలు పార్టీని వీడుతున్నారు. వీటిని రాహుల్, సోనియా తర్వాత ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇక్కడ సోనియా క్రీయాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంచనాల ప్రకారం హర్యానా, మహారాష్ట్రలో పార్టీకి ఓటమి తప్పదు. హర్యానాలో హుడాకు పగ్గాలు అప్పగించారు. పార్టీ ఓటమిపాలైతే ఆయన కథ ఇక ముగిసినట్లే. ఎన్నికల ముంగిట, ప్రస్తుతం సోనియా దృష్టి అంతా సీనియర్లను తప్పించడంపైనే ఉందని సమాచారం. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: