2014లో రాష్ట్ర విభజన తరువాత అయిదేళ్ల పాటు హైదరాబాద్ లోని హైకోర్టు తెలంగాణ..ఏపీ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. ఆ తరువాత అమరావతిలోని నేలపాడులో తాత్కాలిక రాజ్ భవన్ గా కొనసాగుతున్న భవనంలోనే హైకోర్టు నిర్వహించారు. ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదికన హైకోర్టు నిర్మాణం పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో ఇప్పటి వరకు హైకోర్టు ఇన్ ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు నిర్వహించారు.


 ఇప్పటికే హైకోర్టును కర్నూలు ఏర్పాటు చేయాలని..లేదు ఇక్కడే కొనసాగించాలని అమరావతి ప్రాంత న్యాయవాదులు నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం ఆలోచన ఏంటనేది ఇంకా స్పష్టత లేదు.
 ఈ సమయంలో ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వర ప్రమాణ స్వీకారం చేసారు. ఈ  ప్రమాణస్వీకారం లో పొరపాటు జరిగింది. సాధారణంగా రాజ్ భవన్ లో జరిగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం ఈ సారి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయగా  కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. 

అప్పుడు గవర్నర్ ప్రమాణ పాఠం చదివించే సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అని చదవాల్సిన స్థానంలో మధ్యప్రదేశ్ హై కోర్టు చీఫ్ జస్టిస్ అని పొరపాటుగా చదివారు.  అయితే వారి పొరపాటు కాదని..ఆ ప్రసంగం ఇచ్చిన అధికారులదని తేలింది.దీంతో..ఆ వెంటనే పొరపాటును గుర్తించారు. కార్యక్రమం ముగిసిన తరువాత అదే ప్రాంగణం లోని లోపలి గదిలో గవర్నర్ మరోసారి జస్టిస్ మహశ్వరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ సమయంలో పొరపాటును సరి దిద్దుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా సరి చేసుకొని పొరపాటు లేకుండా ప్రమాణ స్వీకారం పూర్తి చేసారు.



ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా ప్రమాణ స్వీకారానికి జీకే మహేశ్వరి కుటుంబసభ్యులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. జస్టిస్ మహేశ్వరిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసారు.  దీంతో ఆయన ఆదివారం సాయంత్రం గన్నవరం చేరుకున్నారు. 
ఆయనకు కలెక్టర్ ఇంతియజ్ తో పాటుగా హైకోర్టు అధికారులు స్వాగతం పలికారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: