పని ప్రదేశాల్లో,కాలేజీలో, రోడ్డు మీద కనీసం తల్లి గర్భంలో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది.చివరకు కాపాడాల్సిన అధికారులు కూడా  వేధింపులకు గురిచేస్తే మహిళకు రక్షణ ఏది?వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాడి చేసిన సంగతి తెలిసిందె.కల్లూరిపల్లిలోని ఇంటికి వచ్చి బీభత్సం సృష్టించారని ఎంపీడీవో సరళ ఆరోపించారు.

లేఅవుట్‌కు అనుమతులు ఇవ్వనందుకే దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంటికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడమే కాకుండా... నీటి పైపులైనును కూడా ధ్వంసం చేశారని సరళ అన్నారు.
 కేబుల్‌ వైర్లను సైతం ముక్కలు చేశారని తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు సరళ వెళ్లగా.. కేసును తీసుకునేందుకు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆమే వెనుదిరిగారు. ఎమ్మెల్యేను పార్టీ తరుపున కనీసం మందలించే ప్రయత్నం కూడ చేయలేదని ఆవేదన వ్యక్తం చేయరు కాగా ఇదంతా మీడియాలో రావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది.


 దీంతో దిగివచ్చిన పోలీసులు ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు బెయిలబుల్ కేసుల క్రింద కేసును నమోదు చేశారు.ఎంపీడీవో వ్యవహారాన్ని పలు పార్టీలు తీవ్రంగా ఖండించాయు.పవన్ కళ్యాణ్ సైతం కోటంరెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోరు..ఎందుకు కేసులు నమోదు చేయరని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే స్వంతపార్టీ నేతలు చేప్పిన అక్రమాలు అనుకూలంగా వ్యవహకరించకపోతే వారిపై దాడులు చేస్తారా అంటూ పవన్  ప్రశ్నించారు.


విధి నిర్వహణలో మహిళ ఉద్యోగులను వేధింపులకు గురి చేసిన ఎమ్మెల్యేలపై నాన్‌బెయిబుల్ కేసులు పెట్టకుండా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉద్యోగులపై ఇలాంటీ చర్యలు పాల్పడిన వారికి ప్రభుత్వం ఎలాంటీ సంకేతాలను ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. సమాజంలో ఇలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాన్ ప్రభుత్వాన్ని కోరారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: