తెలంగాణా ఆర్టీసీ సమ్మె వ్యవహారం లో కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ ఆర్టీసీ సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించమని, అది తెలివైన పని కాదని తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె, పరిష్కారార్ధమై సుమారు నాలుగు గంటలపాటు అధికారులతో సీఎం కేసీఆర్ చర్చ సాగించారు. ఆర్టీసీ సమ్మె గురించి సునీల్ శర్మ అందించిన నివేదికపై సమీక్షానంతరం సీఎం కేసీఆర్ ఓ కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం అంత మంచిది కాదని...,, ఆర్టీసీ ఎండీ కొనసాగుతారని సీఎం పేర్కొన్నారు..,, ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదని...,,, మొత్తంగా ఆర్టీసీని మూడు రకాలుగా విభజిస్తామని చెప్పారు. ఇందులో 50శాతం బస్సులు పూర్తిగా ఆర్టీసీ యాజమాన్యంలో ఉంటాయని, 30శాతం బస్సులు అద్దెకు తీసుకుని వాటి పర్యవేక్షణ ఆర్టీసీకి అప్పగిస్తామని చెప్పారు. ఇక మరో 20శాతం బస్సులు పూర్తిగా ప్రైవేటు వారికేనని తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల అతి ప్రవర్తన వల్లే ఈ చర్యలకు దిగాల్సి వచ్చిందని...,,, తాము ఎవరినీ డిస్మిస్ చేయలేదని.. ఇచ్చిన గడువు తేదిలోగా విధుల్లో చేరకుండా వారాంతట వారే తప్పుకున్నారని సీఎం తెలిపారు.
ఆర్టీసీలో మొత్తం 5200 బస్సులుండగా, 30శాతం అద్దె బస్సులు నడుపుతామని..,, మరొ 20శాతం పూర్తిగా ప్రైవేటు బస్సులేనని సీఎం పేర్కోన్నారు. అంతేకాకుండా, ఆర్టీసీ ఛార్జీలు, ప్రైవేటు ఛార్జీలు పూర్తి సమానంగా ఉంటాయని...,,, ఆర్టీసీ సంఘాల వారు తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నారని సీఎం వ్యాఖ్యానించారు.
ఇకనుంచి ఆర్టీసీలో యూనియనిజం ఉండదని..,, రాయితీ బస్ పాస్‌లు నడుస్తాయని...,,, సబ్సిడీలను ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ చెప్పారు. ఆర్టీసీని క్రమశిక్షణతో నడిపి లాభాల బాట పట్టిస్తామని..,,, అంతేగాక, వచ్చే లాభాల్లో కార్మికులకు బోనస్ కూడా ఇస్తామనడంతో ప్రజలు సైతం మెచ్చుకుంటున్నారు.. మరియు కొత్త నియామకాలపై కసరత్తు ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు...

మరింత సమాచారం తెలుసుకోండి: