తెలంగాణా ఆర్టీసీ సమ్మె రేవంత్ రెడ్డిని చాలా ప్రభావితం చేసినట్టుంది. ఆర్టీసీ కార్మికులు 35 రోజుల ముందుగా సమ్మె నోటీసు ఇచ్చినప్పటికిని... దసరా పండగ ముందు సమ్మె చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడతారా? అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సరి కాదని..,, ఇన్ని రోజుల నిరీక్షణ బదులు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపుండవచ్చును కదా అని సీఎం మీద రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ సిబ్బందితో తగు చర్చలు జరిపి.. సమ్మెను దసరా తర్వాతకు వాయిదా వేసుకోవాలని కోరివుంటే వారు కూడా సహకరించే వారు..?? అని కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అప్పటికి ఆర్టీసీ సంఘాలు అంగీకరించక పోతే.. తాను సైతం ఆర్టీసీ వారిని ఒప్పించే ప్రయత్నం చేసేవారని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులంటే.. సీఎం సార్ ఇంటి కార్మికులు కాదని కేసీఆర్‌నుద్దేశించి రేవంత్ హెచ్చరించారు. సీఎం కొడుక్కి, అల్లుడికి ఆరు నెలల్లోపే తిరిగి ఉద్యోగాలివ్వాగ.. 50వేల మంది ఆర్టీసీ కార్మికులను మాత్రం రోడ్డుకీ లాగడం? సరి కాదంటూ నిలదీశారు. ఆర్టీసీ సమ్మె ఉద్దేశం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదని., తమ న్యాయమైన డిమాండ్లు మాత్రమే నెరవేర్చాలంటున్నారని చెప్పారు. అంతేగాక, ఆర్టీసీ కార్మిక సంఘాలు మెరుపు సమ్మెకు కూడా ఏమీ దిగలేదని...,, కేసీఆర్ వైఫల్యం, ధన దాహం వల్లే ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారని రేవంత్ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకు వస్తుంది..,, మీరు పోరాటం చేయండి.. మీ ఉద్యోగాలను ఎవరూ తొలగించలేరు..,,, మీకోసం కోర్టులు కూడా ఉన్నాయని కార్మిక సంఘాలకు మద్ధతించారు.  మూడు నెలలకో.. మరి కొంత సమాయానికో కేసీఆర్ ఉద్యోగం ఊడటం ఖాయమని రేవంత్ జోస్యం చెప్పారు. కార్మికులతో పెట్టుకోవడం ప్రమాదమని గతంలో కేసీఆర్ అన్నారు.. ఇప్పుడు అదే కేసీఆరే కార్మికులతో పెట్టుకుని తన కొంపను తానే కూల్చుకుంటున్నారని రేవంత్ గుర్తు చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: