పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐరాస పర్యటన తరువాత పరిస్థితులు పూర్తగా మారిపోయాయి.  ఐరాసలో అయన చేసిన అర్థరహిత ప్రసంగం, ఇస్లామిక్ దేశాలను ఒక్కటిగా చేయాలనీ చూసిన ఆయన వైనం, ఇండియాపై కక్కిన విషయం.. అంతర్జాతీయ దేశాలతో అయన ప్రవర్తించిన తీరు అన్ని వ్యతిరేకంగా మారాయి.  పాక్ ను అభివృద్ధి దిశగా నడిపిస్తామని, ఇండియాతో మంచి సంబంధాలు కొనసాగిస్తామని వచ్చిన ఇమ్రాన్.. అయన ప్రవర్తనా తీరును ప్రతి ఒక్కరు తప్పుపడుతున్నారు.  


ఆవేశంలో మాట్లాడేతీరు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టింది. అంతేకాదు, ఐరాసలో రైట్ టు రిప్లై ద్వారా ఇండియా ఇచ్చిన రిప్లై కు పాక్ మైండ్ బ్లాక్ అయ్యింది.  ఐరాసలో చైనా, టర్కీ, మలేషియా దేశాలు తప్పించి మరో దేశం పాక్ కు సపోర్ట్ చేయలేదు.  యునైటెడ్ నేషన్స్ మానవహక్కుల సంఘంలో పిటిషన్ దాఖలు చేసేందుకు తగిన మద్దతు లభించలేదు.  దీంతో అక్కడ పిటిషన్ ను తిరస్కరించారు.  


దౌత్యపరమైన సంబంధాలు నడిపించడంలో ఇండియా ప్రధాని మోడీ దూసుకుపోతుంటే.. పాక్ ప్రధాని మాత్రం వెనకబడిపోయారు.  ఇది ఆ దేశానికి మింగుడుపడని విషయంగా మారింది.  ఇప్పుడు ఇమ్రాన్ చైనాలో పర్యటిస్తున్నారు.  ఆర్థికపరమైన ఒప్పందాల కోసం ఇమ్రాన్ చైనాకు వెళ్లారు. ఇమ్రాన్ తోకూడా పాక్ దేశానికి చెందిన ఆర్మీ చీఫ్ బజ్వా కూడా వెళ్లడం విశేషం.  ఒక ప్రధాని అధికారిక పర్యటనకు ఆర్మీ చీఫ్ కూడా కలిసి వెళ్లడం పలు అనుమానాలకు తావునిస్తోంది.  


ఇమ్రాన్ దౌత్యవిషయంలో వెనకబడిపోయారని, అందుకే పాక్ ఆర్మీ చీఫ్ కూడా వెళ్లారని మీడియా చెప్తోంది.  పైగా ఇమ్రాన్ ను ఎలాంటి మర్యాద, గౌరవం ఇస్తోందో. అలంటి గౌరవ మర్యాదలు పాక్ ఆర్మీ చీఫ్ కు కూడా చైనా ఇస్తుండటం విశేషం. చూస్తుంటే.. ఇమ్రాన్ ను కేవలం ఆ పదవిలో ఒక బొమ్మలా కూర్చోపెట్టి.. ఆర్మీ పరిపాలన సాగించేలా కనిపిస్తోంది.  చూద్దాం ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: