రాజ్యాంగం ప్రకారం భారత ప్రజాస్వామ్యం మూడు స్థంబాలపై నిలబడి ఉంది - శాసననిర్మాణ వ్యవస్థ, ఎక్జెక్యూటివ్ వ్యవస్థ మరియు న్యాయవ్యవస్థ – నాలుగవ స్థంబమే ప్రజలు మెచ్చిన ప్రసారమాధ్యమం. ఇలా నాలుగు స్థంబాలపై ఈ ప్రజాస్వామ్య భువనం సుస్థిరంగా నిలబడింది. అయితే అది నిన్నటి మాట. నేడు అన్నీ వ్యవస్థలు మీడియా చుట్టు పరిభ్రమిస్తున్నాయి. ఎందుకంటే మీడియా పాత్రికేయం యాజమాన్యచెరలో మ్రగ్గుతుంది. పాత్రికేయులకు స్వతంత్ర మనుగడలేని పరిస్థితులు నెలకొన్నాయి.


మీడియా ప్రజాభిప్రాయాన్ని తప్పుడు మార్గంలోకి మళ్లించటం, తప్పుడు వార్తలు ప్రసారం చేయటం, నిజాన్ని చూపించక పోవటం, రాయక పోవటం - ఒకవేళ రాసినా, చూపించినా తమ అనుయాయుల, రాజకీయ ప్రయోజనాల కోసం, తమ సంపదలు పెంచుకోవటానికి, తమ కుల జనాలకు, కుల వర్గాలకు, సాధించటం కోసం – మీడియా అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ - తప్పుదారి పట్టించటం జరుగుతూ వస్తుంది.


రాజ్యాంగ వ్యవస్థల్లోని అవినీతి, బందు ప్రీతి తదితర రుగ్మతలతో సతతం సతమతమౌతున్న ప్రజలకు ఒకప్పుడు ప్రసారమాధ్యమం ఊరట నిచ్చేది. కాని ఇప్పుడు తాను కుళ్ళిపోవటమే కాకుండా సమాజాన్ని కుళ్లబొడుస్తుంది తాజా మీడియా. నేడు జనం శాసనసభ, ఎక్జెక్యూటివ్ రాజ్యాంగ వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలతో సమానంగా ప్రజలు భావించిన నాలుగవ వ్యవస్థైన “ప్రసార వ్యవస్థ అంటే మీడియా” ను కూడా ఒకేగాటన కట్టేశారు. కొంత అలసత్వమున్నా న్యాయవ్యవస్థ ఒంటి కాలిపై మాత్రమే దేశం ముక్కుతూ మూల్గుతూ నడుస్తుంది. కలియుగం కదా! న్యాయం ఒంటికాలిపై నడుస్తుందనేది సార్ధకమైంది.


జనం ఎరిగిన మీడియా అభిప్రాయాన్ని యాజమాన్య స్వార్ధానికి తాకట్తుపెట్టిన  వ్యవహారాన్ని ఏపి ప్రజలు గమనించి దాని అభిప్రాయాన్ని తుంగలో తొక్కి జనం తమ  అభిప్రాయాన్ని 2019 ఎన్నికల్లో ఏకపక్షంగా తమ మాండేట్ ఇచ్చారు. అయితే తెలంగాణాలో కూడా - ప్రజాభిప్రాయాన్ని మీడియా మసిబూసి మారేడు కాయచేయ జూస్తుంది. ముఖ్యంగా "ఆర్టీసీ కార్మికుల సమ్మె" గురించి. సమ్మె విషయం, దానిపై జనాభిప్రాయం ఎలా ఉందో ప్రజలకు తెలిసేది మీడియా ద్వారానే. అయితే ఏపిలో లాగే మీడియా మాయ- తెలంగాణలో పనిచేయటం జోరైంది.


వివిధ పత్రికలు, టివీ చానళ్ళలో తెలంగాణా స్టేట్ ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కథనాలు, వార్తలు మాత్రమే ఒక ప్రధాన వర్గ టివి చానళ్ళలో ప్రసారం అవుతున్నాయి ఆ వర్గ పత్రికల్లో ప్రచురితం అవుతున్నాయి. అంతే తప్ప వాస్తవాలు మాత్రం మాయాంధకారంలో పడేసి వెలుగులోకి రానివ్వడం లేదు. సమ్మె మొదలై మూడు రోజులైంది. ఉద్యోగులు సమ్మెను తీవ్రతరం చేశారు. మానవ హారాలతో వలయాలు సృష్టించారు. బస్సుల్ని బతకమ్మలను అడ్డుపెట్టి కదలకుండా ఆపేశారు. కొందరైతే బస్సులకు అడ్డం నిలబడ్డారు. కానీ ఇదంతా చాలా తక్కువగా మీడియాలో కనిపించాయి.


తెలంగాణ అంతటా సోమవారం బస్సులు విజయవంతంగా తిరిగినట్టు మాత్రమే ఒక వర్గ మీడియా టీవీ ఛానెళ్లు, పత్రికల్లో విపరీత ప్రచారం చేసినట్లు కనిపించింది. కానీ నిజం “సోషల్ మీడియా” ను అనుసరించేవాళ్ళకు వాళ్లకు బాగా అర్ధమైంది. ప్రత్యక్షంగా దసరా పర్వదిన వేళ బస్సుల్లేక ప్రయాణికులు నానా ఇబ్బంది పడుతుంటే, మరో వైపు డిపోల్లో బస్సులు ఖాళీగా ఉన్నాయని పండగను అత్యుత్సాహంగా చేసుకునేందుకు ప్రయాణికులంతా ఆదివారం నాటికే తమ తమ గ్రామాలకు చేరుకున్నారంటూ తెలంగాణా ఆర్టీసీ ప్రకటించడం హాస్యాస్పదం మాత్రమే కాదు మహా నయవంచన అంటూ ఆ నోటా ఈ నోటా ప్రచారం ఉదృతంగా జరుగుతుంది. ప్రజలు తెలంగాణా మీడియాని  దుమ్మెత్తి పోస్తున్నారు.


ఇక హైదరాబాద్ నుంచి తెలంగాణ ఇతర ప్రాంతాలకు పల్లెలకు వెళ్లడానికి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడ్డారో “సోషల్ మీడియా” ఆటాద్డేసు కుంటుంది. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. వీళ్లంతా పూర్తిగా ప్రైవేట్ సర్వీసులలోనే ఎక్కువ ఖర్చు పెట్టి అంటే టిక్కెట్ ధరకు 3 రెట్లు ఎక్కువగా చెల్లించి ప్రయాణించారు.

 

మరోవైపు చార్జీలపై కూడా ప్రభుత్వం, ఆర్టీసీ కలిసి ఇస్తున్న ప్రకటనలు నమ్మతగ్గవిగా అనిపించటం లేదు. 

*తెలంగాణలో ప్రైవేటు బస్సులు ఎక్కువ సంఖ్యలో తిరుగుతూ, తాము చెప్పిన చార్జీల్నే వసూలు చేస్తున్నాయని ప్రకటించుకున్నాయి.

అదనంగా డబ్బులు చెల్లించ వద్దంటూ పోలీసులు, అధికారులు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నప్పటికీ ఈ బాదుడు తగ్గలేదు. ఇదంతా తెలంగాణా ప్రధాన మీడియాలో ప్రసారం కాలేదు.

*కార్మికుల ఆందోళన, ఉద్యోగుల మానవహారాలు, రాస్తారోకోలు, ధర్నాలు, ప్రతిపక్షాల మద్దతు మొదలైన అంశాలకు మీడియా పెద్దగా ప్రధాన్యం ఇవ్వలేదు. ఈ స్థానంలో "ఆర్టీసీ ఆధునికీకరణ"కు కేసీఆర్ చేపట్టబోయే ప్రణాళికకు మాత్రం భారీ ఎత్తున కవరేజీ దక్కింది.

*యదార్ధం ఇలా ఉంటే తెలంగాణా జాతికి గ్రహణంలా పట్టిన ఒక ప్రధాన మీడియా ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించమని, 30శాతం బస్సుల్ని అద్దె లెక్కన, మరో 20శాతం బస్సుల్ని ప్రైవేట్ కింద నడుపుతామంటూ కేసీఆర్ చేసిన ప్రకటనను విరీత ప్రచారం ఇచ్చింది. 

*అంతేకాదు, సబ్సిడీలు యథాతథంగా కొనసాగుతాయని, 50 % ఆర్టీసీ బస్సులే నడుస్తాయంటూ  కేసీఆర్ చేసిన ప్రకటనను హెడ్-లైన్స్ గా పెట్టి గొప్ప కవరేజ్ ఇచ్చింది. అదే సమయంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల్ని, ఉద్యోగులు చేసిన సమ్మెను నిర్లక్ష్యం చేసింది మీడియా.


తెలంగాణలో మీడియాను మేనేజ్ చేసే వ్యవహారం కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా సాగుతూనే ఉంది. ఏ వార్తల్ని హైలెట్ చేయాలి, వేటిని తొక్కిపెట్టాలనే అంశాలపై మీడియా పూర్తి ప్రణాళికతో వ్యవహరిస్తోంది. అంతెందుకు, మొన్నటికి మొన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణలో ఓ వర్గం మీడియా వ్యవహరించిన తీరును ప్రజలంతా చూశారు. ఇప్పుడు అదే బాటలో ఆర్టీసీ సమ్మె కవరేజ్ కూడా సాగుతోంది. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా సాగుతుంటే తప్పులు ఎత్తిచూపాల్సిన మీడియా ప్రభుత్వానికే వంత పాడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: