సామాన్యుడిని కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరల ఘాటును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. అన్నీ రకాల ఉల్లిపాయల ఎగుమతులు నిషేధం పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎగుమతులపై నిషేధం విధిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల కొరతను అధిగమించేందుకు మరో ప్రణాళికను సిద్దం చేసింది..


ఈ నెలాఖరు కల్లా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ముందడుగు వేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ నేతృత్వంలోని ఎంఎంటీసీ కంపెనీని  టెండర్లు కూడా ఆహ్వానించింది. ఉల్లి కొరత తీవ్రంగా ఉండడంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లిధర కిలో రూ.80 వరకు పలుకుతోంది. ఇక వరదలతో ఉల్లిపాయల రవాణాకు ఇబ్బందులు పెరగడంతో ఢిల్లీ వంటి నగరాల్లో ఉల్లి లొల్లి చేస్తుంది. దీంతో దేశంలోని అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తుంది కేంద్రం.


ఇక అసలే  పండుగల సీజన్ కావడంతో పాటు ఈ నెల చివరి వారంలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని పలు చోట్ల ఉపఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఉల్లి ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇకపోతే ఉల్లి స్టాక్ ఎక్కడో ఒకచోట ఆగిపోకుండా కఠిన నిబంధనల ను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వ్యాపారుల వద్ద స్టాక్ నిల్వ విషయంలో పరిమితులను విధించింది.


రిటైలర్ల వద్ద 100 క్వింటాళ్లు, హోల్ సేల్ వ్యాపారుల దగ్గర 500 క్వింటాళ్లకు మించి ఉండకూడదని నిబంధన పెట్టింది. దేశమంతా ఈ నిబంధనలు అమలులో ఉంటాయని, వీటిని ఉల్లంఘించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక ఉల్లి ధరలు పెరగడానికి కారణం ఈసారి తక్కువ విస్తీర్ణంలో వేసిన పంటకు తోడుగా  భారి వర్షాల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పంట నీట మునిగింది. దీంతో ఉల్లి తగినంత సరఫరా లేకపోయిన నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: