బంగారం భారీగా దిగొస్తుంది. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. పండుగ ముందు రోజు బంగారం ధరలు కొండెక్కాయి. ఇప్పుడు ఉన్నట్టుండి బంగారం ధర పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,600కు క్షీణించింది. 

                                     

కాగా 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర రూ.190 తగ్గుదలతో రూ.36,290కు చేరింది. పసిడి ధర పడిపోతే.. వెండి ధర మాత్రం కొండెక్కింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.500 పెరుగుదలతో రూ.48,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పుంజుకోవడమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

                                        

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది దీంతో పసిడి ధర ఔన్స్‌కు 0.46 శాతం పెరుగుదలతో 1,511.75 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.44 శాతం పెరుగుదలతో 17.77 డాలర్లకు ఎగసింది. అయితే ఈ మార్పు రేపు బంగారం ధరపై చూపే సానుకూల ప్రభావం ఉంది. అందుకే బంగారం కొనాలి అనుకునే వారు ఈరోజే కొంటె మంచిది అని నిపుణులు సలహా ఇస్తున్నారు. 

                                        

మరింత సమాచారం తెలుసుకోండి: