ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి వెళ్లనున్నారు. వైఎస్సార్‌సీపీ రాజమండ్రి నగర సమన్వకర్త శివరామసుబ్రహ్మణ్యం కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరవుతారు.

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.


ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


నేటి నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనలకు దిగుతున్నారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యులు నిరసనలు చేపడుతున్నారు.


తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె బుధవారానికి ఐదో రోజుకు చేరుకుంది. సమ్మెపై నేడు కీలక చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వంతో ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్షాలు చర్చలు జరపనున్నాయి. మరోవైపు పూర్తి కార్యాచరణకు కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమవుతోంది.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  ఈరోజు  మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్. అంశం : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మార్పీఎస్ మద్దతు., అక్టోబర్ 17న సకల కులాల మహాదీక్ష. సమావేశంలో ఎమ్మార్పీఎస్  వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ  మాట్లాడుతారు.



తిరుమలలో నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభమవుతాయి. నేటి నుంచి దివ్య దర్శనం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు జారీ చేయనున్నారు._
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి భవానీ భక్తులు దీక్ష విరమించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజరాజే​శ్వరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.


జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోకి రావడంతో పాఠశాలలు, కాలేజీలు నేడు పునఃప్రారంభం కానున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో దాదాపు 60 రోజులుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: