దేశంలో వ్యాపార వాణిజ్య వాతావరణం ఏమాత్రం బాగోలేదని భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) నిర్వహించిన సర్వేల్లో తేలింది. 2008 నాటి ఆర్థిక సంక్షోభం వంటి దుర్భర పరిస్థితులు నెలకొని ఉండేవో, దేశంలో ఇప్పుడూ అలాంటి పరిస్థితులే సుమారుగా నెలకొని ఉన్నాయని ఆర్బీఐ సర్వే తేల్చింది. గత సెప్టెంబరు త్రైమాసికం ముగింపుతో ఇలాంటి పరిస్థితులు మరింత స్పష్టంగా వెల్లడౌతున్నాయని ఆర్బీఐ తన సర్వేలో వివరించింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న మందగమన పరిస్థితుల నేపథ్యంలోనే ప్రభుత్వం ఇటీవల కార్పొరేట్‌ పన్నును భారీగా తగ్గించాలని నిర్ణయించేందుకు కారణం కావచ్చొని సర్వే అభిప్రాయపడింది.


ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో వ్యాపార కార్యకలాపాలు తీవ్రగడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నట్టుగా ఆర్బీఐ తెలిపింది. 2013-14 తరువాత వ్యాపార కార్యకలాపాలు ఇంతగా కుంగడం ఇదే తొలిసారి అని.. ఆర్థిక సంక్షోభం తరువాత పరిస్థితులు ఈ స్థాయికి దిగజారడం ఇది రెండోసారి అని సర్వే తేల్చింది. తొలి త్రైమాసికంలో దేశంలో తయారీ కంపెనీల ఆర్డర్లు 23 శాతం మేర తగ్గిపోవటం మందగమన తీవ్రతకు ప్రతిబింబమౌతుందని సర్వే తెలిపింది.  కొత్త ఆర్డర్లు చెప్పుకోతగ్గ స్థాయికి మించి పడిపోవడం ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రమాదకరమైన హెచ్చరిక వంటిదని ఈ సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో సంస్థల పెండింగ్‌ ఆర్డర్లు అంతకు ముందు త్రైమాసికాలకు కొనసాగింపుగానే పడిపోతూ వచ్చాయని ఆర్బీఐ సర్వే వివరించింది. జూన్‌ త్రైమాసికంలో పరిశ్రమల సామర్థ్య వినియోగం కనిష్టంగా 73.6 శాతానికి పడి పోయింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 76.1 శాతానికి జారిపడింది.


Image result for RBI CCS

నోట్ల రద్దు తరువాత దేశంలో పరిశ్రమల సామర్థ్యపు వినియోగం ఇంత కనిష్టానికి పడిపోవడం ఇదే తొలిసారని ఆర్బీఐ తెలిపింది. పరిశ్రమల వినియోగ సామర్ధ్యం 76 శాతానికి చేరడం  ప్రమాద సంకేతమని ఇక్కడి నుంచి మూలధన పెట్టుబడుల చట్రం తిరిగి పుంజుకోవాల్సి ఉంటుందని, సెప్టెంబరు త్రైమాసికంలో ఇది మరింతగా దిగజారి 73.6 శాతానికి చేరడం శోచనీయమేనని ప్రముఖ ఆర్థికవేత్త ప్రణబ్‌ సేన్‌ అన్నారు. ఇది మరింత తగ్గడంతో దేశంలో క్యాపెక్స్‌ సైకిల్‌ ఇప్పట్లో కోలుకొనే అవకాశాలు కనుచూపుమేరలో కూడా కనిపంచడం లేదని అన్నారు. దేశంలోని మాన్యూఫాక్చరింగ్ కంపెనీల 'వ్యాపార వాతావరణ గుణాత్మక అంచనా' ను వెల్లడించే 'బిజినెస్‌ అసెస్‌మెంట్‌ ఇండెక్స్‌' (బీఏఐ) 2008 నాటి ఆర్థిక సంక్షోభం స్థాయికి చేరిందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో ఆయా సంస్థల వ్యాపార అంచనాలు కూడా కుంచించుకు పోయాయని ఆర్బీఐ సర్వే నివేదిక తెలిపింది. 


సెప్టెంబరుతో ముగిసిన ఈ ఆర్ధిక సంవత్సరం - రెండో త్రైమాసికంలో కొత్త ఆర్డర్లు రావడం క్షీణించడంతో పాటు, ఆ మేరకు ఉత్పిత్తి తగ్గిపోవడం, ఉద్యోగ అవకాశాలు పడిపోవడం కనిపించిందని వ్యాపార వర్గాలు ఆర్బీఐ సర్వేలో తేల్చి చెప్పారు. దేశంలో ఎగుమతులు, దిగుమతుల్లో ప్రమాదకర అంతరం కనిపిస్తుందని సర్వేలో పాల్గొన్న ఆర్ధికవేత్తలు అభిప్రాయపడ్డారు. "ఆర్బీఐ కన్జూమర్‌ కాన్ఫెడెన్స్‌ సర్వే" లో కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తమైంది. 
Summary

మరింత సమాచారం తెలుసుకోండి: