రాష్ట్ర ప్రభుత్వమే  గ్యారంటీ ఇస్తామని ముందుకొచ్చినప్పటికీ.. అప్పు ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ సిద్ధంగా లేకపోవడంతో ఏపీ కి దిక్కు తోచని పరిస్థితిఎదురైంది. ఇటీవల రూ.3 వేల కోట్ల రుణం కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ స్టేట్‌ బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది.  కానీ రాష్ట్ర ప్రభుత్వంపై అప్పుల భారం పెరిగిపోతున్న నేపథ్యంలో.. సర్కారు ఇచ్చే గ్యారంటీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏపీపీఎఫ్‌సీఎల్‌ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఎస్‌బీఐ రెండు పేజీల లేఖ రాసింది.


రూ.3 వేల కోట్ల రుణం మంజూరు విషయంలో జగన్ సర్కారుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ రకంగా షాకిచ్చింది. ఏపీ ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో.. ఏపీ విద్యుత్ సంస్థకు రుణం ఇచ్చేందుకు ఎస్‌బీఐ తటాపటాయించింది.  ఏపీపీఎఫ్‌సీఎల్‌‌కు రుణం ఇస్తే తిరిగి ఎలా తీర్చగలరని ఎస్‌బీఐ ప్రశ్నించింది. అంతే కాదు అప్పు తీసుకున్న మొత్తంతో ఏం చేయదలిచారో చెప్పాలని తమకు వివరించాలని కోరింది.2018-19 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2.52 లక్షల కోట్లు ఉన్నాయి. 

2020 నాటికి అప్పుల భారం రూ.3 లక్షల కోట్లకు చేరుతుందన్న బ్రిక్‌వర్క్‌ నివేదికను ఈ లేఖలో స్టేట్ బ్యాంక్ ప్రస్తావించింది.  ‘2016-17లో ఏపీపీఎఫ్‌సీఎల్‌ రుణాలు రూ.9665 కోట్లుంటే.. 2018 నాటికి అవి రూ.35,964 కోట్లకు పెరిగాయని ఎస్‌బీఐ తెలిపింది.ఇలా రుణభారం భారీగా పెరగడం వల్ల ప్రతిపాదిత రుణ ప్రణాళిక ప్రకారం ఆస్తులు అప్పుల మధ్య అంతరం 714.32 రెట్లు పెరిగింది.
 లాభాలు అతిక్కువగా ఉండటంతో అప్పులు ఇవ్వడానికి ఎస్‌బీఐ వెనుకడుగేసింది.


 క్రిసిల్ D రేటింగ్ ఇవ్వడాన్ని స్టేట్ బ్యాంకు ఆ లేఖలో పేర్కొంది. తమ అనుమానాలను నివృత్తి చేస్తే వాటిని తమ కార్పొరేట్ ఆఫీసుకు పంపుతామని తెలిపింది. ఆస్తులు, అప్పుల నిష్పత్తి 1.25 : 1గా ఉండాల్సి ఉండగా.. విద్యుత్ సంస్థకు 1 : 1గా ఉన్నాయని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: