సమాజంలో నానాటికీ పెరుగుతున్న వికృత పోకడలు భరించలేని స్థాయకి చేరుకుంటున్నాయి. వాటితో పాటుగా మనిషి ఆలోచనలు కూడా కౄరంగా మారుతున్నాయి. తన ఆనందం కోసం తోటివారిని ఇబ్బంది పెట్టడానికి కూడా మనుషులు ఆలోచించడం లేదు. ఓ చోట సంతోషంగా జరుగవలసిన వేడుకను అల్లోకల్లోలంగా మార్చారు యువకులు. ఆ సమయంలో అటువంటి పని చేయడం వల్ల ఎంతమంది ఇబ్బందికి గురవుతారో అనే ఆలోచన లేకుండా ప్రవర్తించి అక్కడున్న వారిని పరుగులు పెట్టించారు.


ఒక వేళ వాళ్లు చేసిన పనికి ప్రాణాలు పోయుంటే పరిస్దితి ఏంటి. అదృష్టవశాత్తు ఏం జరుగలేదు కాబట్టి సరిపోయింది. ఇక మనిషి అవివేకానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇక్కడ జరిగిన సంఘటన అని తెలుస్తుంది. ఈ వివరాలు పరిశీలిస్తే దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో కర్దంపురి ప్రాంతంలో ఈ నెల 7వ తేదీన షోయబ్ మాలిక్ అనే యువకుడి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలకు వచ్చిన సల్మాన్ (21),  షావాజ్ మాలిక్(18)లు కంట్రీమేడ్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. వివాహ వేడుకలో ఇద్దరు యువకుల అత్యుత్సాహం వేడుకకు హాజరైన వారిని భయభ్రాంతులకు గురిచేసింది.


ఒక్కసారిగా తుపాకి శబ్దం వినిపించడంతో ఆ పెళ్లికి వచ్చినవారు పరుగులు తీశారు.  వివాహ వేడుకల్లో కాల్పులు జరపడమే కాకుండా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పెళ్లి వేడుకలో కాల్పుల ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన పోలీసులు ఐపీసీ 336, సెక్షన్ 27 ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన నిందితులిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కంట్రోమేడ్ తుపాకీ ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ దాచారు అనే విషయమై దర్యాప్తు సాగిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: