మహా రాష్ట్ర ఎన్నికలు వస్తున్న సందర్భంలో రోజు రోజుకు అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం బాగా ముదిరిపోతుంది.

అయితే మహాకూటమిగా ఏర్పడిన శివసేన పార్టీ బీజెపి మీద దుమ్మెత్తిపోస్తున్నారు.శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చాలా ఘాటుగా మండి పడుతున్నారు.దేశానికి,మహా రాష్ట్రానికి హాని చేసే ఏ కార్యక్రమాలు కూడా తాను జరగనివ్వను అని మరియు 2014 లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇలానే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారన్న విషయం తెలిసిందే ఇది ఇలా ఉంటే తమ రాష్ట్రానికి ముప్పు వాటిల్లే నిరుద్యోగ సమస్యలు గాని,ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం లాంటి సమస్యలు గాని ఇలాంటి దుస్సహానికి పాల్పడినా తాము ఒప్పుకోమని స్పష్టంగా తెలియచేశారు.బీజెపి ఎంత మిత్ర పక్షం అయినప్పటికీ మాకు ఉన్న సిద్ధాంతాలను అతిక్రమించమని కూడా వారు స్పష్టం చేశారు.ఉద్ధవ్ తమ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని.

పేద వాడికి నష్టం కలిగే ఏ అంశం అయినా వదిలిపెట్టేది లేదని కూడా వారు చెప్పారు.అదే విధంగా బిజెపి అధికారంలోకి రావడానికి ఏదైనా కుట్ర చేసినా లేక అందులో భాగంగా ఎలాంటి అబద్ధపు భావనలకు పాల్పడినా కూడా తాము ఒప్పుకోమని కూడా వారు తెలియచేశారు.అన్ని బాగానే ఉన్నాయి.కానీ అసలు కదేంటి అంటే బీజెపి,శివసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి అందరికి తెలుసు కానీ ఇలా తమతో ఉండి తమకే ఎందుకు ఇలా వార్నింగ్ ఇస్తున్నారో అర్థం కావడంలేదు అంటు బీజెపి కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.శివసేన ఎవరితో పొత్తు అయినా కావచ్చు గాని తమకున్న నిబంధనలు,సిద్ధాంతాలను ఎప్పటికి అతిక్రమించమని చెప్తున్న తీరు చూస్తే అధికారంలోకి వస్తే చాలా నిక్కచ్చిగా పాలన చేస్తారేమో అని కూడా అనిపిస్తుందంట.మరి అధికారం లోకి ఏ పార్టీ రానుందో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడక తప్పదంటున్నారు సామాన్య జనం.

మరింత సమాచారం తెలుసుకోండి: