కీల‌క‌మైన మూడు రాష్ట్రాల ఎన్నిక‌ల స‌మ‌యంలో....కాంగ్రెస్ పార్టీ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఏ సిద్ధాంతం ఆధారంగా అయితే...మ‌హారాష్ట్ర, హ‌ర్యానా ఎన్నిక‌ల స‌మ‌యంలో...బీజేపీని ఎదుర్కునేందుకు...ఆ పార్టీ ఉప‌యోగించే జాతియ‌త వాదం ఆధారంగానే దెబ్బకొట్టాల‌ని సిద్ధ‌మైంది. అధికార బిజెపి జాతీయతపై ఇస్తున్న వివరణకు దీటుగా కాంగ్రెస్ గట్టి వివరణ ఇవ్వడానికి తగిన శిక్షణా తరగతులు నిర్వహించాలని షెడ్యూల్ ఖ‌రారు చేసింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా, సమితి స్థాయిల్లో కాంగ్రెస్ నేతలకు ‘జాతీయత’ పై శిక్షణ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం నిర్ణయించింది. 


ఈ శిక్ష‌ణ త‌ర‌గ‌తుల యొక్క ముఖ్య ఉద్దేశం....స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ నాయకత్వం నిర్వహించిన సాహసోపేత పాత్రను జాతీయతా భావాలను చాటి చెప్పడమే ఈ శిక్షణ తరగతుల ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా...కాంగ్రెస్ క్రేజ్‌ను పెంచే నిర్ణ‌యాలు తీసుకుంది. ముఖ్యమైన అంశాల్లో క్షేత్రస్థాయిలో ఓటర్లతో అనుసంధానం కావడంపై శిక్షణలో ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకు త‌గిన అంశాల‌ను సైతం ఎంచుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు, 1971తరువాత పాకిస్థాన్‌ను బంగ్లాదేశ్, తూర్పు పాకిస్థాన్‌గా విభజించి భారత దేశ కీర్తి ప్రతిష్ఠలను పెంపొందింప చేసే సంఘటనలు కూడా శిక్షణ తరగతుల్లో చోటు చేసుకుంటాయి.  గత లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో ఈ శిక్షణ తరగతులు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఈ మేర‌కు పార్టీ రాష్ట్రాల అధినేతల సమావేశంలో కాంగ్రెస్ ముఖ్యులు నిర్ణ‌యం తీసుకున్నారు.


ఇదిలాఉండ‌గా, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత స‌ల్మాన్ కుర్షీద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పార్టీలో ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూస్తే.. రానున్న హ‌ర్యానా, మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ విజ‌యం సాధించ‌డం అసాధ్య‌మే అని స‌ల్మాన్ కుర్షీద్ తెలిపారు. ఈ ఏడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింద‌ని, ఆ ఓట‌మి త‌ర్వాత అవ‌మాన భారంతో రాహుల్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని వ‌దిలేశార‌ని, దాంతో ఆ పార్టీ ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌న్నారు. రాహుల్ మ‌ధ్య‌లోనే పార్టీని వ‌దిలివెళ్ల‌డం వ‌ల్ల ఆ పార్టీ మ‌రింత ద‌య‌నీయంగా మారింద‌న్నారు. మేం ఎంత వేడుకున్నా.. రాహుల్ మాత్రం అధ్య‌క్ష హోదా నుంచి త‌ప్పుకున్నార‌ని, ఆయ‌న నిర్ణ‌యాన్ని గౌర‌విస్తున్నామ‌న్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: