బ్రిటిష్ ప్రధాని చర్చిల్..,, అమెరికా అధ్యక్షుడు రూజ్వేల్డ్ ఈ ఇద్దరూ కలిసి మొదట అట్లాంటిక్ సముద్రంలోని ఓ ఓడరేవులో చిన్న సమావేశాన్ని ఏర్పరుచుకొని,, అట్లాంటిక్ చార్టర్ పై తొలుత ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం కొరకు 1941, ఆగస్టు14న సంతకాలు చేయడం జరిగింది.. తర్వాత 1945, అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ఆర్థికాభివృద్ధి..,, సామాజికాభివృద్ధి..,, మానవ హక్కుల నిమిత్తం ఇది సమిష్టి కృష్టి చేస్తుంది. 193 దేశాలు ఈ సమితిలో ప్రధాన దేశాలుగా ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉంది. ప్రతి సంవత్సరం అక్టోబర్24 వ తేదీన ఐక్యరాజ్య దినోత్సవం గా జరుపుకుంటాం.

ఇదిలా వుంటే నేడు ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఖజానా పూర్తిగా నిండుకునే పరిస్తితికి రానుంది. 230 మిలియన్ డాలర్ల లోటుతో నడుస్తున్న ఐరాస, ప్రస్తుతం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది.
ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ షుమారు గా 37 వేల మంది ఉద్యోగులను ఉద్దేశించి రాసిన లేఖలో తీవ్ర ఆందోళన కనబరిచారు. తాను జీతభత్యాలను చెల్లించేందుకు అదనపు చర్యలు తీసుకోవలసి ఉందని..,,, ప్రస్తుతం ఐరాస లోటు బడ్జెట్ 230 మిలియన్ డాలర్లని...,, ఈ నెలఖరుకు ఐరాస ఖజానా దాదాపు గా ఖాళీ అయ్యే అవకాశలున్నాయని...,,, అతను చెప్పుకొచ్చారు.. 2019 లో అవసరమైన నిధులలో 70 శాతం మాత్రమే సభ్య దేశాలు ఇచ్చినట్లుగా..,, దాని వలన సెప్టెంబరు చివరినాటికి 230 మిలియన్ డాలర్ల లోటు ఏర్పడిందని తాను వివరణనిచ్చారు. అక్టోబరు చివరినాటికి మిగులు నిధులు కూడా ఖర్చయిపోయే ప్రమాదం ఉందని...,,
ప్రస్తుత ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు గా తెలిపారు. అధికారిక పర్యటనలను తగ్గించుకోవడం, ఇంధన పొదుపు, సమావేశాల వాయిదా వంటి చర్యలను చేప్పట్టదలచినట్టుగా పేర్కొన్నారు.
ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడటానికి సభ్య దేశాలు కూడా తనవంతు బాధ్యత తీసుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: