జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విషయార్దమై కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ కాస్త ఘాటుగానే స్పందించారు.. రాష్ట్రంలో అప్రజాస్వామిక, దుర్మార్గపు పాలన కొనసాగుతోందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ అంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగించాలంటూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని సోమవారం నాడు ఉత్తమ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని సీఎం కేసీఆర్‌ అంటున్నారు..,,, కానీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో సకల జనుల సమ్మెను అప్పటి ప్రభుత్వం చేయనివ్వకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా...? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ రకంగా, అధికారంలోకి వచ్చాక మరో రకంగా మాట్లాడడం సీఎం కేసీఆర్‌కే చెల్లిందని....,,, ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులు, సంఘాలు, ఆర్టీసీ కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వంపై ధైర్యంగా పోరాడాలంటూ... ఉత్తమ్ తెలిపారు.. అంతేగాక కాంగ్రెస్‌ పార్టీ కూడా వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. 

అసలు ఆర్టీసి వారు.. వారి డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె ప్రారంభిస్తే..,,, ఆ విషయాన్ని పక్కదారి పట్టిస్తు.. కొంత వాటా ప్రభుత్వం ప్రైవేటు వారి పరం చేస్తాం అనడం ఒక వైపు...,,, మరో వైపు రగులుతున్న ఈ పరిస్తితిని "అగ్గికి ఆజ్యం పోస్తున్నట్లుగా" ప్రతిపక్ష నేతలు వాడుకోవడం..,, ఈ సందిగ్దత మధ్య అసలు ఆర్టీసి వారి డిమాండ్లను కనీసం పరిగణలోకి తీస్కుంటారో...,, లేదో కూడా నాడు అర్ధం కాని పరిస్థితి.. ఒక సామాన్య దిగువ తరగతి వారి నుంచి ప్రతొక్కరికి ఆర్టీసీ అవసరం ఎంతో వుంది..,, సులువైనా// సురక్షితమైన ప్రయాణానికి మొదటి ప్రాముఖ్యత ఆర్టీసీ దే అనడం అతిశయోక్తి కానే కాదు కదా.....

మరింత సమాచారం తెలుసుకోండి: