నేడు తెలంగాణా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ప్రధాన సమస్య ఆర్టీసీ సమ్మె ... పండుగ రోజుల్లో సమ్మెకి పాల్పడి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు.. కానీ తాము గత నెల రోజుల ముందుగానే లేఖ ని అందించినట్టుగా వివరిస్తున్నారు..,, ఒకవేళ నెల రోజుల ముందుగా  ప్రభుత్వానికి తెలిపున్నట్టయితే.. ప్రభుత్వం ఎందుకు వారి సమస్యలను పరిగణించలేదు..?? 

ఈ సమ్మె విషయార్థమై కొందరు ప్రజలు ఆర్టీసీ కార్మికుల పక్షాన మాట్లాడినా.. మన వ్యవసాయ శాఖా మంత్రి 'నిరంజన్ రెడ్డి' మాత్రం ఆర్టీసి వారు- తాము ఎక్కిన చెట్టును తామే నరుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. కార్మిక నేతలు రహస్య ఎజెండాతో పని చేస్తున్నారని...,,, యూనియన్‌ నేతల ఉచ్చులో కార్మికులు పడటం సరి కాదని...,,, ప్రతిపక్షాల వారిని తీవ్రస్థాయిలో నిరంజన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి డిమాండ్లను అమలు చేస్తారా...??? కార్య సాధ్యంకాని హామీలు అమలు చేయడం ఏమంత తెలివైన పని అంటూ నిరంజన్‌ రెడ్డి ప్రశ్నించారు..

ఆర్టీసీ సమ్మె గురించి సునీల్ శర్మ అందించిన నివేదికపై సమీక్షానంతరం సీఎం కేసీఆర్ ఓ కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం అంత మంచిది కాదని...,, ఆర్టీసీ ఎండీ కొనసాగుతారని సీఎం పేర్కొన్నారు..,, ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదని...,,, మొత్తంగా ఆర్టీసీని మూడు రకాలుగా విభజిస్తామని చెప్పారు. ఇందులో 50శాతం బస్సులు పూర్తిగా ఆర్టీసీ యాజమాన్యంలో ఉంటాయని, 30శాతం బస్సులు అద్దెకు తీసుకుని వాటి పర్యవేక్షణ ఆర్టీసీకి అప్పగిస్తామని చెప్పారు. ఇక మరో 20శాతం బస్సులు పూర్తిగా ప్రైవేటు వారికేనని తెలిపిన సంగతి తెలిసిందే..

అసలు నిజంగానే ఆర్టీసీ వారు రహస్య అజెండా తో పనిచేస్తున్నారా..?? లేదా ఆర్టీసీ వారిని ప్రైవేటీకరణ చేయడం రాష్ట్ర యోచన..?? అనేది ప్రజలకు ఇంకా అర్ధం కాకపోవడం ఆశ్చర్యం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: