శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మాతలలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తలు గ్రామ సచివాలయానికి రంగులు వేస్తుండగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ కుమారుడు సాగర్ అనుచరులతో కలిసి కర్రలు, కత్తులతో దాడికి దిగాడని తెలుస్తోంది. ఈ దాడిలో రాజశేఖర్, నాగరాజు అనే ఇద్దరు గ్రామ వాలంటీర్లతో పాటు వైసీపీ కార్యకర్తలైన శ్రీరాములు, తిరుపతి గాయపడ్డారని సమాచారం. 
 
దాడిలో గాయపడినవారిని కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాగర్ గ్రామ సచివాలయానికి ఎటువంటి రంగులు వేయవద్దని పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగులు ఎవరూ ఉండకూడదని అక్కడ ఉన్న ఉద్యోగులను కూడా బెదిరించారు. కత్తులు, కర్రలతో కొంతమంది టీడీపీ కార్యకర్తలు బెదిరించి అక్కడ ఉన్న ఉద్యోగులను పంపించివేశారని తెలుస్తోంది. 
 
వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం గాయపడిన నలుగురు కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గొడవకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా ఉండటంతో సాగర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 
 
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. రెండు వేరు వేరు ప్రాంతాలలో జరిగిన ఘటనల్లో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరోచోట నలుగురు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్త షేక్ బాజీపై పదిమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాజీ తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన చీరలు తీసుకోలేదని అల్లా బకాష్ ఇమాంబిలపై విచక్షణా రహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: