ఇటీవల కాలంలో కల్తీ లేని నిత్యావసర వస్తువంటూ ఉండడం లేదంటే అతిశయెక్తి కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫలాన వస్తువుల్లో కల్తీ ఉందని చెప్పలేని దుస్థితి. మోసాలకు కేరాఫ్ గా నిర్యవసర వస్తువుల కల్తీ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉప్పు, పప్పు మొదలుకొని చివరికి పాలే కాదు తాగే నీళ్లు సైతం కల్తీ అవుతున్నాయి. ఈ పరిణామాల నేసథ్యంలో భారత దేశ అత్యున్నత న్యాయస్థానం కల్టీకి ముగింపు పలికేందుకు దృష్టి సారించింది. దాదాపుగా మూడు దశాబ్దాల పాటు వాదప్రతివాదాలను విన్న దేశ సర్వోన్నత ధర్మాసనం తమ తుది తీర్పును వెలువరించింది. పాలను కల్తీ చేసి అమ్ముతున్నవారికి గుణపాఠం అయ్యేలా సుప్రీంకోర్టు తీర్పు వెలవరించింది.



25 ఏళ్ల కిందటి కేసులో ముద్దాయికి ఇప్పుడు ఆరు నెలల జైలుశిక్ష పడింది. నేరస్తుణ్ని కనికరించేదేలేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసు 1995 నవంబర్‌లో నమోదు అయింది. రాజ్ కుమార్ అనే వ్యక్తి అమ్మిన పాలను ల్యాబ్‌లో పరీక్షించగా కొవ్వు శాతం కేవలం 4.6 గానూ, కొవ్వు కాని ఘన పదార్థం (ఎమ్ఎస్ఎన్ఎఫ్) 7.7 శాతం ఉన్నట్టు తేలింది. ఆహార కల్తీ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ఇది 8.5 శాతంగా ఉండాలి. దీంతో అతనిపై కేసు నమోదుచేయగా కోర్టులో విచారణ కొనసాగింది. ఈ క్రమంలో అప్పట్లోనే ట్రయల్ కోర్టు కుమార్‌ను దోషిగా గుర్తించింది. ఇదే తీర్పును సెషన్స్ కోర్టు, హైకోర్టులు కూడా సమర్థించాయి. 
 


దీనిపై రాజ్ కుమార్ తరపు లాయర్ వాదనకు దిగారు. పాల శాంపిల్‌ను పరీక్షించడంలో జాప్యం జరిగడం వల్ల స్వల్ప తగ్గుదలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన వాదించారు. ఈ కేసు 24 ఏళ్ల నాటిది కావున తన క్లయింటు పట్ల కోర్టు కనికరం చూపాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అయితే కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. జస్టిస్ దీపక్ గుప్త, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం నేరస్తుడిపై  కనికరం చూపడం కుదరదని.. అతడు ఆరునెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టంచేసింది. చట్టసభలో ఒక్కసారి ప్రమాణాలను నిర్దేశించిన తర్వాత వాటిని అనుసరించకపోతే శిక్ష తప్పదని చెప్పింది.



మరింత సమాచారం తెలుసుకోండి: