మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఇప్పటికే నామినేషన్లు పూర్తయ్యాయి.  విత్ డ్రా కూడా ముగిసింది.  ఇక మిగిలింది పోటీనే.  అక్టోబర్ 21 వ తేదీన ఈ రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  అన్ని పార్టీలు తమ శక్తిమేరకు ప్రచారం చేసుకుంటూ బిజీగా ఉన్నాయి.  ఎప్పటిలాగే బీజేపీ ప్రచారంలో జోష్ పెంచింది.  ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది.  రెండు రాష్ట్రాలను తిరిగి తమ ఖాతాలో వేసుకోవడానికి బీజీపీ శాయశక్తులా పనిచేస్తున్నది.  


మహారాష్ట్రలో కొంతమేర బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి బలాన్ని పెంచుకోవాలని చూస్తున్నది.  దానికి తగ్గట్టుగా రాష్ట్ర నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.  రాష్ట్ర నాయకులు ఎంత బలంగా పనిచేసినా.. కాంగ్రెస్ అధిష్టానం నుంచి పెద్దగా సపోర్ట్ దొరకడం లేదు.  కేంద్ర క్యాడర్ లో బలం తగ్గిపోయింది.  ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆపార్టీకి పెద్ద దిక్కు లేకుండానే పార్టీ నడుస్తున్నది.  కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా ఉన్నారు. 


గత కొంతకాలంగా సోనియాకు ఆరోగ్యం సరిగా లేదు.  దీంతో ఆమె రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు.  అంతపెద్ద యాక్టివ్ గా లేరు.  కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ 2019 లో లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.  తాను ఆపదవిలో ఉండలేనని చెప్పేశాడు.  రాహుల్ రాజకీయాలను చాలెంజింగ్ గా తీసుకోలేదు.  ఫలితం పార్టీ ఇప్పుడు ఇరకాటంలో పడిపోయింది.  


గతంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కొంత చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నారు.  ప్రచారం నిర్వహించేవారు.  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయన ఏ పదవిలోనూ లేరు.. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన్నే అధ్యక్షుడిగా భావిస్తున్నారు.  గాంధీ కుటుంబాన్ని కాదని బయట వ్యక్తులను ఎవరినైనా నియమించినా పార్టీ ముక్కలౌతుంది.  అందుకే పార్టీ సీనియర్ నేతలు ఆ కుటుంబానికే అధ్యక్ష పదవిని కట్టబెడుతూ వస్తున్నారు.  మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతల నుంచి ఎలాంటి సహాయసహకారాలు అందకపోతుండటంతో.. పాపం రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు చేతులెత్తేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: