ఒకరి స్వభావం తెలియాలంటే వారికి ఒక సారి అధికారం ఇచ్చి చూడాలని అన్నారు ఎవరో ఒక విఙ్జుడు. అలాగే ఏ కాంతతో నైనా ఏకాంటంలో ఉన్నప్పుడే ఆ వ్యక్తి వ్యక్తిత్వం తెలిసేది. ఇప్పుడు కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చమని కోరగా దానికి ప్రతిగా 48 వేల మంది పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనను తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌-పర్సన్ విజయశాంతి తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఖండించారు. 


దానికి తోడు "ఆ ఉద్యోగులను విధుల నుంచి తొలగించలేదని... వాళ్లకు వాళ్లే సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారు" అంటూ టిఎస్-ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వితండవాదం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేవలం తన మాట వినలేదనే ఒకే ఒక నెపంతో, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సీఎం నియంతృత్వ ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VIJAYASHANTI' target='_blank' title='vijayashanti-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>vijayashanti</a> in huzurnagar election campaign


తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే టిఎస్-ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ - తమకు ఎన్నికల సమయంలో కూడా అదే హామీ ఇచ్చారని, దాన్ని నెరవేర్చమని ఉద్యోగులు అడిగినందుకు 48 వేల మంది పైగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం వేటువేసిన కేసీఆర్‌ నిరంకుశత్వం తీరు క్షమించరాదని అన్నారు.
 

కొద్ది రోజుల్లో జరగబోయే హుజూర్‌నగర్ ఎన్నికల్లో ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని అడిగితే, ఆ వ్యక్తిని గుర్తించి, ఓటర్ల జాబితా నుంచి తొలగించేందు కు ముఖ్యమంత్రి వెనుకాడరనే అనుమానాన్ని విజయశాంతి వ్యక్తం చేశారు. 


ఒకవేళ ఎవరైనా రేపు ఎన్నికల్లో  తమ ఓట్లు ఓటర్ల జాబితా నుండి గల్లంతయ్యాయి అని అడిగితే, తాము ఎవరి ఓట్లూ తొలగించలేదని, వాళ్లకు వాళ్లే "ఓటర్ల నుండి సెల్ఫ్ డిస్మిస్" చేసుకున్నారని కెసిఆర్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని విజయశాంతి సెటైర్ వేశారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌కు మద్దతు ఇస్తామని చెప్పిన సీపీఐ, ఎన్నికలు జరగడానికి ముందే అధికారపార్టీకి మద్దతు ఇచ్చే విషయంపై పునరాలోచిస్తామని ప్రకటించడం కేసీఆర్ అప్రజాస్వామ్య విధానాలకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. 


ఈ పరిణామాలను చూసిన తర్వాత హుజూర్‌నగర్ ఓటర్లందరూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటానికి టిఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడం ఒక్కటే శరణ్యమని బలంగా స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో, ఏడు సీట్లలో టిఆర్ఎస్‌ను ఓడించి అధికార పార్టీకి గుణపాఠం నేర్పిన విధంగానే, హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని గెలిపిస్తే తప్ప కెసిఆర్ మందీమార్బలం దూకుడుకు కళ్లెం పడదన్నారు. విఙ్జులైన హుజూర్‌నగర్ ఓటర్లు తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే చారిత్రక తీర్పు ఇస్తారని విజయశాంతి విశ్వాసం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: