తెలంగాణ లో ఇకపై ప్లాస్టిక్  పూర్తిగా నిషేధం  అంటున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ దీనిపై అధికారులకు ముఖ్యమయిన  ఆదేశాలు  కూడా జారీ చేశారు. తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చదిద్దేందుకు ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు అని స్పష్టం చేసారు. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని ఇక మీదట రద్దు అని  కెసిఆర్ గారు  ప్రగతి భవన్‌లో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు.

ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అని, మానవ జీవన శైలి లో  ప్లాస్టిక్ వినియోగం తీవ్రంగా పెరిగింది అని... దీని నిషేధం పై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి  అని  తెలిపారు. దీనికి అవసరమైన విధివిధానాలను అమలు   చేసి వెంటనే కార్యాచరణ చేయాలని ఆదేశించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద దీన్ని అనుసరించి ఇక మీదట ఆచరించాల్సిందిగా సూచించారు సీఎం కేసీఆర్. 


ప్లాస్టిక్‌ను నిషేదిస్తూ కేబినెట్ భేటీలో ఉత్తర్వులు జారీ చేస్తునట్టు  ఆయన మీడియాకి  తెలిపారు. ఈ  సమావేశంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో కేంద్రం నుంచి  అవార్డులు పొందిన పలు  జిల్లాల కలెక్టర్లను ఆయన అభినందించారు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఇక మీదట పూర్తిగా నిషేదించాలని  దేశ ప్రజలకు ప్రధాని మోదీ గారు కూడా పలు సార్లు  విఙ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీ 150 జయంతి సందర్భంగా  అక్టోబర్ రెండవ తేదీ నుండి ఇది  అమలు కావాలన్నారు.

తాజాగా సీఎం కేసీఆర్ కూడా ప్లాస్టిక్‌ నిషేధంపై నిర్ణయం తీసుకోవడం  పై అందరు  హర్షం వ్యక్తం చేసారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కూడా  ఇది  మొదలు కానుంది . దీనికి సంబంధించి  ఎలాంటి  సూచనలు, సలహాలు అయినా ఇవ్వచ్చు అని పరియావరణం ప్రేమికులను  కోరుతున్నా అని  కేటీర్  గారు ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: