సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ముప్పయ్ రోజుల ప్రణాళిక కార్యక్రమం విజయవంతం  ముగియటం  తో సీఎం కెసిఆర్ ఉద్యోగ సంఘాల అధినేతలను  కలిసి అభినందించారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఎన్టీవో నేతలు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరువు భత్యం, పీఆర్సీపై కేసీఆర్‌తో  పలు విషయాలు పై చర్చించినట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని.. ప్రభుత్వ ఉద్యోగులకు 3.44 శాతం మేర కరువు భత్యం  ఇచ్చేందుకు ఆయన సమ్మతం తెలిపారని సమాచారం.


ఐతే హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యం లో  ఎన్నికల కోడ్  ఇప్పుడు అమల్లో ఉన్న కారణంగా.. దీనిపై ఇప్పుడే ప్రకటన చేయబోరని తెలిపారు . ఎన్నికలు పూర్తయ్యాక ఉద్యోగ సంఘాలకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెబుతారని పేర్కొన్నారు. 2019, జనవరి 1 నుంచి 3.44 డీఏ వర్తిస్తుంది అని  త్వరలోనే  దీనికి సంబందించిన జీవో విడుదల చేయనున్నట్లు తెలియచేసారు . ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉన్న తరుణంలోనే సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాలు సమావేశం కావటం ఇప్పుడు అందరికి హాట్‌టాపిక్‌గా మారింది.

ఎన్నికల  అనంతరం ఉద్యోగులను పిలిపించి దశల వారీగా నిర్ణయం తీసుకుంటాం అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు రాజకీయ పార్టీలు తమ మద్దతు ప్రకటించిన సంగతి ఇప్పటికే  తెలుస్తుంది. రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాల మద్దతు కూడా తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు భావించాయి. తమ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ సంఘాలు కూడా కలిసి రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు.

అయితే ఈ విషయంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఊహించని విధంగా షాక్ తగిలిందనే ప్రచారం జరుగుతోంది.మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఎన్జీవో ఉద్యోగులు మద్దతు ఇవ్వకుండా చేసేందుకు  కూడా సీఎం కేసీఆర్ ఈ రకమైన పన్నాగం  చేశారనే పుకార్లు  వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: