హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఓట్లకోసం నానా పాట్లు పడుతున్నాయి. సామాన్యంగా ఎవరి దగ్గర నుండి ఎక్కువ ఓట్లు రాబట్టుకోవచ్చో ముందే తెలుసుకొని వారి చుట్టూ ఈగల్లా ముసరడం మన నాయకులకున్న తెలివి. ఇందుకోసం ఇప్పుడు నాయకులంతా బాబాల చుట్టూ తిరుగుతూ వారి మద్దతు కోసం పోటీ పడుతున్నారు.


ఇకపోతే ఆధ్మాత్మిక సంస్థల ప్రభావం ఓటర్లపై మిగతా రాష్ట్రాలకంటే హరియాణాలో విపరీతంగా ఉంటుంది. ఇక్కడి భక్తులు తమ గురువులు ఏ పార్టీకి ఓటు వెయ్యమని చెబితే వారికే గుడ్డిగా ఓటు వేసేవారు అధిక సంఖ్యలోనే కనిపిస్తారు.. అందుకే ఇప్పుడు ఇక్కడి రాజకీయాలన్నీ డేరాల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆధ్యాత్మిక గురువు.  అత్యాచార కేసులో సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించిన బాబా.


ఈయన ప్రస్తుతం  జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.ఈయన మద్దతిచ్చిన పార్టీ తప్పకా గెలుస్తుందనే నమ్మకం ఉన్న నాయకులు అప్పుడే ఈ డేరాతో సంప్రదింపులకు దిగారు. కాని ఈ సారి ఏ పార్టీకి మద్దతివ్వాలో ఇంకా నిర్ణయించుకోలేదని, 15 మంది సభ్యులతో కూడిన ఒక రాజకీయ వ్యవహారాల కమిటీతో రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి, ఆతర్వాత వచ్చే ఫలితాలకనుగుణంగా ఏ పార్టీకి మద్దతివ్వాలో నిర్ణయిస్తామని కమిటీ సభ్యుడు జోగిందర్‌ సింగ్‌ చెప్పారు..


ఇతనే కాకుండా, సత్‌లోక్‌ ఆశ్రమ్స్‌ గురువు రామ్‌పాల్‌.  డేరా బాబా శ్రీ బాలక్‌ పురి గురువ కరణ్‌ పురి.  డేరా గౌకరణ్‌ ధామ్‌ గురువు కపిల్‌ పురి.. వీళ్లంతా హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తారని పేరుంది. అందుకే ఎన్నికల్లో పోటిచేస్తున్న నాయకులు వీరిని ప్రసన్నం చేసుకుని ఓట్లను రాబట్టాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు హరియాణాలో డేరా రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతుందనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డేరాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి.


మరింత సమాచారం తెలుసుకోండి: