టీఎస్  ఆర్టీసీలో కార్మికుల సమ్మె ప్రభావం బాగా  కనిపిస్తోంది.  ఈ ప్రభావం ప్రజలపై తీవ్రంగా కనిపిస్తోంది. దసరా పండుగ కు సెలవు లకు వెళ్ళినవారు తిరుగు ప్రయాణం చాల కష్టతరంగా మారింది. గమ్యస్థానాలకు చేరుకోవడానికి సైరైనా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం  ఆర్టీసీ  లో కొత్తవారిని  నియమించారు. అయినా ప్రజలకు పూర్తి స్థాయిలో  సదుపాయాలు అందడం లేదు. అందులోను కొన్ని తప్పిదాలు మనం చూస్తూనే ఉన్నాం.

అలాంటి ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. కామారెడ్డి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు మేడ్చల్ చెక్ పోస్టు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా, పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. డ్రైవర్ల స్థానంలో స్టీరింగ్ పట్టుకున్నవారి వల్ల కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి . ఆ పోలీసు వాహనం వెళ్లి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులకు గాయాలు అయ్యాయి. ఆర్టీసీ బస్సును నడుపుతున్న ప్రైవేట్ డ్రైవర్ నిర్వాకం వల్లే ఇలా జరిగిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. 

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలంటూ కార్మికులు ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది..తాత్కాలికంగా కొత్త డ్రైవర్లను తీసుకుని వారితో బస్సులు నడిపిస్తోంది. ఈ క్రమంలో అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీలో రెగ్యులర్ డ్రైవర్లు ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రమాదాలు జరిగేవి. అయితే, ప్రైవేట్ డ్రైవర్ల చేతిలో ప్రమాదాలు జరగడంతో హైలైట్ అవుతున్నాయి.
 ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా ప్రభుత్వం దిగిరాకపోగా, బెదిరింపు ధోరణికి పాల్పడుంతోదని ఆర్టీసీ కార్మికుల జేఏసీ మండిపడుతోంది.ఈ విషయమై తెలంగాణ గవర్నర్ తమిళ సై ను జేఏసీ నేతలు కలిసారు . తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఈనెల 17న తెలంగాణ బంద్ చేయాలని ఆర్టీసీ కార్మికుల జేఏసీ ప్లాన్ చేసింది. ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైంది. కొత్త రిక్రూట్‌మెంట్ చేస్తామని చెబుతోంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఏపీలో జగన్‌ను చూసైనా నేర్చుకోవాలంటూ నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో నేతలు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: