బిజెపి నేత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ప్రజల సమస్యలు విన్నవించటానికి తమకు  గవర్నర్ అపాయింట్మెంట్ దొరకడం లేదని తమిళసై  ముందే కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత్ రావు  ప్రకటించగా... మరుసటి రోజే  ఆయనకు గవర్నర్ కార్యాలయం నుండి పిలుపు వచ్చింది. కాగా నేడు  రాజ్ భవన్ లో  గవర్నర్ తమిళసై  సౌందర్య రాజన్ ను  కలిసిన వి.హనుమంత రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతన గవర్నర్ వచ్చాక తమకు న్యాయం జరుగుతుందనే  ఆశ కలుగుతుందని కాంగ్రెస్  నేత వి హనుమంత్  రావు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా నేడు రాజ్ భవన్  గవర్నర్ తమిళ్ సై తో  సమావేశమైన కాంగ్రెస్  సీనియర్ నేత వి.హనుమంతరావు... గవర్నర్ తో  పలు అంశాలపై చర్చించారు. 

 

 

 

 

 సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వి హనుమంత రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపిన వి.హనుమంతరావు... ఆర్టీసీ సమ్మెతో నలుగురు ఉద్యోగులు  చనిపోయారని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కనీసం బాధితులను పరామర్శించ లేదని విహెచ్ విమర్శించారు. కాగా ఈ సందర్భంగా హాజీపూర్ సంఘటనకు అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు  విహెచ్ తెలిపారు . హాజీపూర్  సంఘటనకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్  కోర్టు ఏర్పాటు అంశంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. 

 

 

 

 

 కాగా  తాము  గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన అన్ని  అంశాలపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత్ రావు . అంతేకాకుండా తన ఇంట్లో జరిగే  సత్యనారాయణ వ్రతానికి గవర్నర్ తమిళ సైని ఆహ్వానించారట విహెచ్. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మె పై కేసీఆర్ తీరును నిరసిస్తూ పలు విమర్శలు చేశారు. కెసిఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో నిరంకుశ వైఖరితో  వ్యవహరిస్తున్నారని... ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు సమ్మెకు మద్దతు తెలుపుతూ పోరాటం చేస్తామని తెలిపారు విహెచ్.

మరింత సమాచారం తెలుసుకోండి: