తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య తీవ్రం అవుతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం..మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం..అతి వేగం ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఓ వైపు రోడ్డు రవాణా సంస్థవారు ఎన్ని భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు..డంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కానీ వాహనదారుల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు..చిన్న పొరపాటు ప్రాణాలు హరించి వేస్తున్నాయి.

తాజాగా షాద్ నగర్ లో కారు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.  హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న రోడ్డు డివైడర్ ని ఢీ కొట్టడంతో పల్టీలు కొట్టుకుంటూ పొలంలోకి కారు దూసుకు వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

ఓ కారును ఓవర్ టేక్ చేయబోయి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా,  ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: